IMC 2024 నుంచి రూ. 1,099 కే కొత్త 4G ఫోన్ లు విడుదల చేసిన Reliance Jio
రిలయన్స్ జియో చవక ధరలో కొత్త 4G ఫోన్ లను విడుదల చేసింది
భారతదేశ అతిపెద్ద టెక్నాలజీ మీట్ IMC 2024 నుంచి లాంచ్ చేసింది
ఈ ఫోన్ లు అత్యంత చవకైన జియో ప్రీపెయిడ్ ప్లాన్ తో జతగా వస్తాయి
IMC 2024, భారతదేశ అతిపెద్ద టెక్నాలజీ మీట్ అయిన ఇండియా మొబైల్ కాంగ్రెస్ నుంచి రిలయన్స్ జియో చవక ధరలో కొత్త 4G ఫోన్ లను విడుదల చేసింది. జియో Bharat V3 మరియు V4 లను కేవలం రూ. 1,099 ధరలో ప్రకటించింది. ఈ రెండు ఫోన్లు కూడా జియో సూట్ యాక్సెస్ ను కలిగి ఉంటాయి మరియు అత్యంత చవకైన జియో ప్రీపెయిడ్ ప్లాన్ తో జతగా వస్తాయి.
IMC 2024 : Reliance Jio ఫోన్ లాంచ్
ఇండియా మొబైల్ కాంగ్రెస్ (IMC 2024) నుంచి నిన్న రిలయన్స్ జియో ఈ ఫోన్ లను విడుదల చేసింది. జియో భారత్ వి 3 మరియు భారత్ వి 4 లను ప్రకటించింది. ఈ రెండు ఫోన్లు కూడా అతి త్వరలో అమెజాన్ ఇండియా, రిలయన్స్ డిజిటల్ స్టోర్స్ నుంచి సేల్ కి అందుబాటులోకి వస్తావని కూడా జియో తెలిపింది.
ఈ రెండు ఫోన్లు కూడా వాటి డిజైన్ పరంగా వేరుగా ఉంటాయి. అయితే ఈ రెండు ఫోన్స్ స్పెసిఫికేషన్ లలో పెద్దగా వ్యత్యాసం లేకపోవచ్చని తెలుస్తోంది. ఈ ఫోన్స్ జియో యొక్క జియో ఫోన్ భారత్ రూ. 123 ప్రీపెయిడ్ ప్లాన్ కు అనుకూలతతో వస్తాయి. ఈ ప్లాన్ 28 రోజుల పాటు అన్లిమిటెడ్ కాలింగ్, 14GB డేటా (రోజుకు 0.5GB) మరియు SMS లాభాలను అందిస్తుంది.
అంతేకాదు, Jio Tv యాక్సెస్ తో అనేకమైన లైవ్ ఛానల్స్, Jio Cinema తో మూవీస్ మరియు సిరీస్ లు, జియోపే UPI యాప్ కోసం కూడా యాక్సెస్ ను అందుకుంటారు. ఈ ఫోన్ వెయ్యి రూపాయల ధరలో వచ్చిన స్మార్ట్ ఫోన్ కు ఎంత తీసిపోని ఫీచర్స్ ను కలిగి ఉంటుంది.
Also Read: IRCTC Big News: రైల్వే అడ్వాన్స్ బుకింగ్ కోసం కొత్త రూల్స్ నవంబర్ 1 నుంచి అమలు.!
ఇక ఈ ఫోన్ ఫీచర్స్ విషయానికి వస్తే, ఈ ఫోన్ లో 1000 mAh బ్యాటరీ వుండు మరియు ఈ ఫోన్స్ 23 ఇండియన్ లాంగ్వేజ్ లకు మద్దతునిస్తాయి. ఈ జియో కొత్త ఫీచర్స్ ఫోన్స్ ను మైక్రో SD స్లాట్ తో వస్తాయి మరియు ప్రత్యేకమైన మైక్రో SD కార్డ్ ద్వారా స్టోరేజ్ ను 128GB వరకు పెంచుకోవచ్చు.