రిలయన్స్ Jio కు ఇతర నెట్ వర్క్స్ కు మధ్య ఉన్న గొడవ ఏంటి?
Reliance Jio కు మిగిలిన టెలికాం నెట్వర్క్స్ నుండి ఇబ్బందులు ఎదురవుతున్నట్లు తెలుస్తుంది తాజా పరిణామాలు చూస్తుంటే. అయితే ఇది Jio పేరుతో రిలయన్స్ అందిస్తున్న 4G ఇంటర్నెట్ కారణంగా మొదలయిన ఇబ్బందులా అని ప్రశ్న వస్తుంది ఇప్పుడు. కానీ ఇతర నెట్ వర్క్స్ చెబుతున్న జవాబు చూస్తే ఈ ప్రశ్న కు అవును అని సమాధానం కూడా చెప్పలేము.
ఫోన్ కాల్స్ విషయంలో ఇంటర్ కనెక్షన్ పోర్ట్స్ అవసరం ఉంటుంది టెలికాం నెట్వర్క్స్ కు. దీనికి సంబంధించి ఒక నెట్ వర్క్ మరో నెట్ వర్క్ కు మినిమమ్ పోర్ట్స్ provide చేయాలి.
కాని రిలయన్స్ కు సరిపడా కాదు కదా, ఇవ్వ వలసిన పోర్ట్స్ మిగిలిన నెట్ వర్క్స్ ఇవ్వటం లేదని చెబుతుంది రిలయన్స్.. అయితే ఇప్పటివరకూ స్టాండర్డ్స్ ప్రకారం…
12,500 పోర్ట్స్ అవసరం ఉండేది 2 కోట్ల 20 లక్షల subscribers కు. కాని రిలయన్స్ కు కేవలం 1,400 పోర్ట్స్ అందాయి. కాని మిగిలిన నెట్ వర్క్స్ అన్నీ అసోసియేషన్ ద్వారా ప్రస్తుత రిలయన్స్ users ను బేస్ కు అనుగుణంగా ఇవ్వ వలసిన వాటి కన్నా 10 రెట్లు ఎక్కువ పోర్ట్స్ అందజేస్తున్నట్లు తెలిపారు. అయినా ఇబ్బందులు రావటానికి కారణం రిలయన్స్…. వాళ్ళ కస్టమర్స్ కు ఇస్తున్న ఫ్రీ కాల్స్ అండ్ ఇంటర్నెట్ వంటి unlimited ఆఫర్స్ కారణం అని చెబుతున్నాయి మిగిలిన నెట్ వర్క్స్. వీటి వలన పోర్ట్స్ సరిపోవటం లేదని వారి వాదన.
అసలు పోర్ట్స్ ఏంటి? ఇవి లేకపోతే ఏమవుతుంది?
కాల్స్ మధ్యలో డ్రాప్ అవటం మరియు కనెక్ట్ కాకపోవటం జరుగుతుంది. ఇక్కడ రిలయన్స్ subscribers కు ఇలా జరుగుతుంది.
రిలయన్స్ Jio సిమ్ ఎలా తీసుకోవాలి? ఎన్ని పద్దతులు ఉన్నాయి ఇలాంటి వాటిపై పూర్తీ సమాచారం కొరకు ఈ లింక్ లోకి వెళ్ళగలరు.
ఈ క్రింద వీడియో లో airtel 4g మరియు వోడాఫోన్ 4G లలో ఏది ఎంత ఎక్కువ ఇంటర్నెట్ స్పీడ్ ఇస్తుందో కంపేర్ చేయటం జరిగింది తెలుగు లో. చూడగలరు..