30,000 రూపాయల కన్నా తక్కువ ధరకే ఐఫోన్ X.

Updated on 03-Nov-2017

ఐఫోన్ X  ప్రారంభించినప్పటి నుండి ముఖ్యాంశాలలో ఉంది. ఆపిల్ యొక్క  లేటెస్ట్ ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్ ఇప్పుడు సింపుల్ గా  జేబులోకి ప్రవేశిస్తుంది. ఈ ఫోన్ ఇప్పుడు కంపెనీ  యొక్క అత్యంత ఖరీదైన ఫోన్. భారతదేశంలో ఈ ఫోన్ ధర 89,000 రూపాయల వద్ద మొదలవుతుంది, కానీ రిలయన్స్ జియో వినియోగదారులకు ప్రత్యేకమైన అవకాశాన్ని అందిస్తోంది, దీని ద్వారా వినియోగదారులకు ఈ ఫోన్ ని  70% తక్కువ ధర వద్ద కొనుగోలు చేయవచ్చు.భారతీయ వినియోగదారులకు ఐఫోన్ X ను కొనుగోలు చేయడానికి జియో ఆఫర్ తో ,  ఇప్పుడు ఇది అంత కష్టంగా ఉండకపోవచ్చు. రిలయన్స్ జియో ఆఫర్ వినియోగదారులకు 70% బై  బ్యాక్ ఆఫర్ ని  అందిస్తోంది. ఈ ఆఫర్లో వినియోగదారులు  70% వరకు సేవ్ చేయవచ్చు.

బై బ్యాక్ ఆఫర్

రిలయన్స్ జీయో నుంచి ఈ  బయ్ బ్యాక్ ప్లాన్  ఆపిల్ యొక్క ఐఫోన్ 8 మరియు ఐఫోన్ 8 ప్లస్ లో కూడా  అందుబాటులో ఉంది. రిలయన్స్ జియో యొక్క వినియోగదారులు రిలయన్స్ రిటైల్ లిమిటెడ్ స్టోర్, జియో యాప్ , jio.com లేదా అమెజాన్ నుంచి 1,999 రూపాయలకుప్రీ ఆర్డర్  చేయవచ్చు. సెప్టెంబరు 29 న రిలయన్స్ జియో యొక్క బైబ్యాక్  ఆఫర్ ప్రారంభమైంది, డిసెంబరు 31 వరకు ఇది చెల్లుతుంది. వినియోగదారుడు కూడా ఈ ఫోన్ పై  క్యాష్బ్యాక్ని పొందవచ్చు, దీనికి వారు సిటి క్రెడిట్ లేదా వరల్డ్ డెబిట్ కార్డ్ను ఉపయోగించాలి.

ఐఫోన్ X ను కొనుగోలు చేసిన తర్వాత, వినియోగదారులు బయ్ బ్యాక్  ఆఫర్ కోసం నమోదు చేయాలి. వినియోగదారులు MyJio యాప్ ని  డౌన్లోడ్ చేయాలి రిలయన్స్ జియో ప్రకారం, ఒక సంవత్సరం తరువాత వినియోగదారులు ఫోన్ ని  తిరిగి ఇస్తే, ఈ ఫోన్ పూర్తిగా  వర్కింగ్ కండీషన్ లో ఉండాలి . దీనికి అదనంగా, వినియోగదారుడు 799 లేదా అంతకంటే ఎక్కువ ఆఫర్ను రీఛార్జి చేయాలి.Jio.com వద్ద రిలయన్స్ జీయో యొక్క అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి. అప్పుడు మీకు కావలసిన ఐఫోన్ X యొక్క వేరియంట్  ఎంచుకోండి. ఇప్పుడు మీ ఏరియా  కోడ్ ని  నమోదు చేయండి మరియు ఐఫోన్ సంఖ్యను పూరించండి. దీని తరువాత, ఇమెయిల్ ID, మొబైల్ నంబర్ మరియు పేరు గురించి సమాచారాన్ని పూరించండి. మీరు చెల్లించడానికి కావలసిన పద్ధతి ఎంచుకోండి. రూ. 1,999 ను ఇవ్వడం ద్వారా ఇప్పుడు మీ ఫోన్ ముందు బుక్ చేయండి.

 

 

 

Connect On :