డేటా ఆఫర్లతో నోకియా 3310 4G వేరియంట్ లాంచ్ ,JIO మరియు HMD గ్లోబల్ చర్చలు….
రిలయన్స్ జియో నిరంతరంగా స్మార్ట్ఫోన్ తయారీదారులతో కొత్త భాగస్వామ్యాన్ని ఏర్పరుచుకుంటుంది, కంపెనీ భారతదేశంలో నోకియా 3310 యొక్క 4G వేరియంట్ ని ప్రారంభించేందుకు HMD గ్లోబల్ తో చర్చలు నిర్వహిస్తుంది, ఇది డేటా మరియు కాల్ ఆఫర్లు తో ప్రారంభించబడుతుంది.
నోకియా 3310 4G త్వరలోనే ప్రకటించబడుతుందని భావిస్తున్నారు. ఈ డివైస్ ఇటీవల చైనా యొక్క TENAA సెర్టిఫికేషన్ వెబ్సైట్ లో మోడల్ నెంబర్ TA-1077 తో ఇవ్వబడింది. HMD గ్లోబల్ బార్సిలోనా లో రాబోయే మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ లో నోకియా 3310 యొక్క 4G వేరియంట్ ని లాంచ్ చేస్తారు .
సోర్స్ ప్రకారం, HGD గ్లోబల్ NGage మరియు E72 వంటి కొన్ని పాత డివైసెస్ ను 4G కనెక్టివిటీతో తిరిగి తీసుకురావడానికి ప్రయత్నిస్తుంది. ఈ నోకియా ఫోన్స్ స్పెక్స్ గురించి మీరు మాట్లాడినట్లయితే, ప్రస్తుత తరం డివైసెస్ తో పోటీ పడటానికి వారు అప్గ్రేడ్ చేయాలి.
ఏమైనప్పటికీ, నోకియా 3310 4G వేరియంట్ తో జియో ఏ డేటా ప్లాన్ ఇవ్వటానికి యోచిస్తోంది అనేది సమాచారం లేదు.