రిలయన్స్ జియో, 2000 రూపాయలు కంటే తక్కువ ఖర్చులో 4G ఫోన్లు ప్రారంభించటానికి చైనీస్ హ్యాండ్సెట్ మేకర్స్ తో చర్చలలో ఉంది. అయితే ఈ రిలయన్స్ అంబానీ మరో సోదరుడు నుండి వస్తున్న కంపెని.
రిలయన్స్ రాబోయే నెలల్లో భారతదేశం లో మొట్ట మొదటిగా జాతీయ 4G సేవ ను ప్రారంభించేందుకు యోచిస్తోంది. ఈ ప్రాజెక్ట్ లో Gionee, Huawei మరియు Xiaomi వంటి చైనీస్ కంపెనీలతో కలిసి చీప్ ఫోన్లను తయారుచేసేందుకు రిలయన్స్ నిమగ్నం అయి ఉంది. గతంలో ఈ ప్రాజెక్ట్ పై రిలయన్స్ సొంతంగా వేరే కంపెనీలతో కలవకుండా, సొంతంగా దాదాపు 13$ బిలియన్లు ఖర్చు పెట్టి, చీప్ హాండ్ సెట్లను తయారు చేయటంలో విఫలమైంది. నివేదిక ప్రకారం భారతదేశం అంతటా 5,000 పట్టణాలు మరియు నగరాలలో 4G సేవను ప్రారంభించటానికి యోచిస్తోంది రిలయన్స్. అంటే దాదాపు 90 శాతం నగరాలలో 4G ఉంటుంది. 215,000 గ్రామాలలో కూడా రిలయన్స్ 4G ప్రాజెక్టు ను ప్లాన్ చేస్తుంది. ప్రస్తుతం కంపెని అన్ని లీడింగ్ ఫోన్ కంపెనీలతో తమ జియో నెట్వర్క్ ను ఉపయోగించుకునే విధముగా రానున్న ఫోన్లని తయారు చేసుకోమని చర్చలు జరుపుతుంది.
"మేము రిలయన్స్-జియో తో ఒక అగ్రిమెంట్ కుదుర్చుకున్నాము. అది ఇప్పటిలో చెప్పలేము." అని ఒక ప్రధాన చైనీస్ మొబైల్ కంపెని వెల్లడించింది. మరొక చైనీస్ కంపెని కూడా డీల్ ఫైనల్ అయ్యాక త్వరలో అనౌన్స్ చేస్తామని చెప్పుకొచ్చారు.
ఆధారం: Times Of India