రిలయన్స్ Jio మొదటి స్మార్ట్ ఫోన్ Lyf Earth 1 డిటేల్స్ అనౌన్స్
రిలయన్స్ Jio నుండి ఎప్పటి నుండో వినిపిస్తున్న 4G స్మార్ట్ ఫోన్స్ వార్తలకు ఇక బ్రేక్. నిన్న మొదటి ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ ను అనౌన్స్ చేసింది కంపెని.
ఇది Lyf సబ్ బ్రాండింగ్ నుండి వస్తుంది. ఫోన్ పేరు Lyf Earth 1. IBNLive రిపోర్ట్స్ లో దీని డిటేల్స్ విడుదల అయ్యాయి. మొబైల్ మార్కెట్ లోకి ఎప్పుడు వస్తుందో తెలపలేదు.
స్పెక్స్ – 5.5 in ఫుల్ HD అమోలేడ్ డిస్ప్లే 401PPi తో వస్తుంది. ఆక్టో కోర్ 1.5GHz స్నాప్ డ్రాగన్ 615 SoC అండ్ అడ్రెనో 405GPU కలిగి ఉంది.
ర్యామ్ పై ఇన్ఫర్మేషన్ లేదు, 32gb ఇంబిల్ట్ స్టోరేజ్, 64 sd కార్డ్ సపోర్ట్, 13MP అండ్ 2MP డ్యూయల్ రేర్ కేమేరాస్, 5MP ఫ్రంట్ కెమెరా.
3500 mah బ్యాటరీ, 4G LTE, బ్లూటూత్ 4.0 తో 162.5 గ్రా బరువు తో Lyf Earth 1 ఆండ్రాయిడ్ 5.1.1 లాలిపాప్ os పై రన్ అవుతుంది.
ఈ మొబైల్ రిలీజ్ తోనే 4G Jio మొబైల్ నెట్ వర్క్ సర్వీసెస్ కూడా స్టార్ట్ అవుతాయా లేదా అనేది కూడా స్పష్టత లేదు. కంపెని ఉద్యోగస్తులకు మాత్రం 4G స్టార్ట్ అయ్యింది.