POCO కంటే ముందుగా రెడ్మి ఒక స్నాప్ డ్రాగన్ 855 SoC స్మార్ట్ ఫోన్ తీసుకురానుంది?

POCO కంటే ముందుగా రెడ్మి ఒక స్నాప్ డ్రాగన్ 855 SoC స్మార్ట్ ఫోన్ తీసుకురానుంది?
HIGHLIGHTS

రెడ్మి నోట్ 7 మరియు రెడ్మి నోట్ 7 (ఒకవేళ) విడుదల తరువాత, షావోమి యొక్క ఉప బ్రాండ్ అయిన, రెడ్మి ప్రధాన ప్రాసెసర్ స్నాప్ డ్రాగన్ 855 SoC తో నడిచే ఒక స్మార్ట్ ఫోన్ తీసుకురానున్నట్లు అంచనా.

Redmi ఒక స్వతంత్ర బ్రాండ్ గా అవతరించిన తరువాత, ఇది దాని మొదటి సంవత్సరంలోనే Poco మార్గంలో వెళుతున్న తెలుస్తోంది. షావోమి యొక్క ఉప బ్రాండ్ అయిన Poco గత సంవత్సరం ఒక ప్రధాన స్నాప్డ్రాగెన్ 845-శక్తితో ఒక స్మార్ట్ ఫోన్ను ప్రారంభించింది. అలాగే, దాని సరికొత్త అనుబంధ సంస్థ అయిన, Redmi కూడా ఈ సంవత్సరంలో ఒక ప్రధాన స్నాప్ డ్రాగన్ 855 ప్రాసెసెరుతో నడుస్తున్న స్మార్ట్ ఫోన్ను ప్రారంభించటానికి ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. బహుశా, మార్కెట్ చేజిక్కించుకోవడనికి మరొక ప్రయత్నం కావచ్చు.

రెడ్మి యొక్క జనరల్ మేనేజర్ అయిన, లూ వైబింగ్ చేత Weibo (వయా GSMArena) లో పోస్ట్ చేయబడిన  ఒక పోస్ట్ ప్రకారం, మిడ్-రేంజ్ జోన్ నుండి బయటకు రావడానికి మరియు స్నాప్ డ్రాగన్ 855 చిప్సెట్ తో పనిచేసే స్మార్ట్ ఫోన్లతో, ఫ్లాగ్షిప్ స్మార్ట్ ఫోన్ల విభాగంలోకి  ప్రవేశించడానికి కంపెనీ అంచనాలను సిద్ధం చేసుకుంటోంది. షావోమి యొక్క షెన్జెన్ R & D ఇన్స్టిట్యూట్లో జరిగిన చర్చలోని  కొన్ని వివరాలను, వెయిబింగ్ తన ఇమేజితో పాటుగా రెడ్మి సిబ్బందితో ఒక ఇమేజితో ఒక పోస్ట్ను వెల్లడించాడు. కానీ,  ఈ ప్రధాన రెడ్మి ఫోన్ గురించి మరే ఇతర వివరాలను ఈ పోస్ట్ లో తెలియచేయలేదు.

భారతదేశంలో, రెడ్మి ప్రస్తుతం రెడ్మీ నోట్ 7 ను ప్రారంభించటానికి కొన్ని రోజుల సమయం ఉంది అనిపిస్తోంది.  ఎందుకంటే, రెడ్మి ఈ రెడ్మి నోట్ 7 గురించి చేస్తున్న కొన్ని టీజింగ్స్ ఇందుకు కారణం అని చెప్పొచ్చు. ఆలాగే, రెడ్మి నోట్ 7 ఫోన్ను ఇండియాలో 48MP కెమెరా సెటప్పుతో, అత్యంత సరసమైన స్మార్ట్ ఫోనుగా  విడుదలచేయనున్నట్లు భావిస్తున్నారు.  రెడ్మీ భారతదేశంలో నోట్ 7 విడుదల సమయం గురించి చూస్తే , అది శామ్సంగ్ కొత్తగా విడుదల చేసిన గెలాక్సీ M సిరీస్ స్మార్ట్ ఫోన్ల పైన ఎక్కువ ప్రభావాన్ని చూపేలా అనిపిస్తోంది.  షావోమి మరియు రెడ్మి, ఫిబ్రవరిలో నెలలో భారతదేశంలో రెడ్మి నోట్ 7 లాంచ్ 14 వ తేదీన ఉండవచ్చని  భావిస్తున్నారు. ఈ రెడ్మి నోట్ 7 తో పాటుగా రెడ్మి నోట్ 7 ప్రో  ని కూడా భారతదేశంలో విడుదల చేయవచ్చని నివేదికలు అంచనావేసి చెబుతున్నాయి. ఎందుకంటే షావోమి గత సంవత్సరం, ఫిబ్రవరి 14 వాలెంటైన్స్ డే రోజు Redmi Note 5 Pro ని విడుదల చేసింది, కాబట్టి అదే తేదీన భారతదేశంలో ఈ ఫోన్ల విడుదల కావచ్చనిపిస్తోంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo