Redmi Note 7 ఇప్పుడు ‘సూపర్ నైట్ సీన్ కెమేరా మోడ్’ అప్డేట్ అందుకోనుంది

Updated on 25-Jan-2019
HIGHLIGHTS

ఒక సాఫ్ట్ వేర్ అప్డేట్ ద్వారా 'సూపర్ నైట్ సీన్ కెమేరా మోడ్' అందుకోనుంది.

ఇటీవలే, చైనాలో విరుధ్దల చేసిన రెడ్మి నోట్ 7 స్మార్ట్ ఫోన్, ఇప్పుడు ఇండియాలో కూడ విడుదలకానున్నట్లు చేస్తున్న టీజింగ్స్ ఇండియన్ మొబైల్ మార్కెట్లో ఒక కొత్త ఒరవడిని రేకెత్తిస్తున్నాయి. ఇందుకు కారణం, ఈ స్మార్ట్ ఫోనులో అందించిన 48MP కెమేరా అని చెప్పొచ్చు. అయితే, ఇప్పుడు ఈ కెమెరాకి సంభంధించిన మరొక కొత్త ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. అదేమిటంటే, రానున్న ఒక సాఫ్ట్ వేర్ అప్డేట్ ద్వారా 'సూపర్ నైట్ సీన్ కెమేరా మోడ్' అందుకోనుంది.

ఇది ముందుగా Mi Mix 3 స్మార్ట్ ఫోనులో అందించబడింది మరియు దీని సహాయంతో ఈ రెడ్మి నోట్ 7 నుండి తక్కువ కాంతిలో కూడా మంచి బ్రైట్ పోటోలను తీసుకునే వీలుంటుంది. ఇప్పటి వరకూ, Mi Mix 2S మరియు Mi 8 వంటి ఫోన్లలో అందుబాటులోవున్న ఈ సూపర్ నైట్ సీన్ కెమేరా మోడ్, ఇప్పుడు రెడ్మి నోట్ 7 కి అందనుంది.

ఈ న్యూస్, కంపెనీ యొక్క అధికారిక Weibo అకౌంట్ ద్వారా ఈ కంపెనీ ఒక కొత్త సాఫ్ట్ వేర్ అప్డేట్ విడుదల చేయనున్నట్లు తెలిపింది. అంతేకాదు, జనవరి 25న 10:00AM CST (7:30AM IST) కి మరొక ఫ్లాష్ సేల్ చేపట్టనుంది. ప్రస్తుతం గూగుల్ మరియు వన్ ప్లస్ ఉపయోగిస్తున్న, నైట్ సైట్ మోడ్ మరియు నైట్ మోడ్ వంటి వాటి పైన పైచేయి సాధించానికి షావోమి ఈ సూపర్ నైట్ సీన్ కెమేరా మోడ్ ని తీసుకొచ్చినట్లు అనిపిస్తోంది. ఈ కొత్త సూపర్ నైట్ సీన్ కెమేరా మోడ్ తో మరింత సవివరమైన మరియు బ్రైట్ ఫోటోలను తీసుకోవచ్చని, షావోమి చెబుతోంది.        

రెడ్మి నోట్ 7 ప్రత్యేకతలు

డిస్ప్లే పైన వాటర్ డ్రాప్ నోచ్ తో ఈ రెడ్మి నోట్ 7,  2340×1080 పిక్సెళ్ళు గల ఒక 6.3-అంగుళాల LCD ప్యానెల్ తోవస్తుంది.  ఒక 450 nits బ్రైట్నెస్ తో కేవలం 0.8mm మందపాటి bezelsను కలిగిఉంది. ఈ ఫోన్ కూడా 2.5D కర్వ్డ్ గ్లాస్ రక్షణలో ఉంచబడింది మరియు ఒక బ్యాక్ -మౌంటు వేలిముద్ర సెన్సార్ను కలిగి ఉంది. ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 660 SoC కి జతగా  3GB, 4GB లేదా 6GB RAM వేరియంట్లలో 32GB లేదా 64GB స్టోరేజిలలో లభిస్తాయి. ఒక 4,000 mAh బ్యాటరీతో ఈ స్మార్ట్ ఫోన్ వస్తుంది.

పోర్ట్రైట్ షాట్లకు అనుగుణంగా 5MP సెకండరీ సెన్సారుతో కలిపి 48MP సెన్సారు కలిగిన మొదటి Redmi ఫోన్ ఇది. ఈ నోట్ 7 యొక్క 48MP సెన్సార్ తక్కువ కాంతి లో కూడా మంచి షాట్లు తీసుకోవటానికి సహాయపడుతుందిని  కంపెనీ పేర్కొంది. ఈ  48MP కెమెరా సెన్సార్ 1/2-అంగుళ పరిమాణాన్నికలిగి స్మార్ట్ ఫోన్లలో అందంగా పెద్దదిగా ఉంటుందిని సోనీ సంస్థ  వెల్లడించింది. ఇందులో అతితక్కువ 0.8um అంగుళాల పిక్సెళ్ళు నిజంగా బాగుంటుంది, కెమెరా సెన్సార్లో 48 మెగాపిక్సెళ్లను క్రామ్ చేయగలిగింది. Xiaomi ప్రకారం, Redmi Note 7 పోస్టర్ వంటి HD ఫోటోలను తీయగలదని చెబుతోంది. ముందుభాగంలో, పోర్త్రైట్ మోడ్  మరియు పేస్ బ్యూటిఫికేషన్ కి సపోర్ట్ చేసేలా, AI అల్గారిథం కలిగిన ఒక 13MP కెమెరా ఉంటుంది. 

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :