ముఖ్యాంశాలు:
1. రెడ్మి నోట్ 7, నోట్ 7 ప్రో మరియు రెడ్మి గో ఫోన్లను ఇండియాలో విడుదల చేయనున్నట్లు తెలిసింది
2. 2019 మొదటి త్రైమాసికంలో ఈ ఫోన్ను ప్రారంభించవచ్చు
3. రెడ్మి నోట్ 7 ఇప్పటికే చైనాలో ప్రారంభించబడింది
ఇటీవలే, రెడ్మి నోట్ 7 ను ప్రారంభించింది – ఈ సంస్థ ఒక స్వతంత్ర బ్రాండ్ గా మారిన తరువాత దాని యొక్క మొదటి ఫోనుగా ఇది ఉంటుంది. Redmi యొక్క ప్రో వేరియంట్ ప్రారంభించటానికి సిద్ధంగా ఉన్నదని ప్రస్తుతం పుకార్ల నడుమ టెక్ న్యూస్ వేదిక అయిన, mysmartprice ఒక మూడు Redmi బ్రాండెడ్ ఫోన్లు, Redmi Note 7, Redmi Note 7 Pro, మరియు Redmi Go, లను ఈ 2019 మొదటి త్రైమాసికంలో భారతదేశంలో, విడుదల చేయనున్నట్లు భావిస్తున్నారు అని నివేదించింది.
రెడ్మి నోట్ 7 ప్రో ఇంకా చైనాలో విడుదల కాకపోయినప్పటికీ, Weibo నుంచి వచ్చిన సమాచారం ప్రకారం, రెడ్మి నోటే 7 ప్రో ని అక్టోబరులో ప్రకటించినట్లు, ఒక క్వాల్కమ్ స్నాప్డ్రాగెన్ 675 ప్రాసెసరుతో అమలుచేయనున్నట్లు భావిస్తున్నారు. దీనితో, రెడ్మి నోట్ 7 ప్రో యొక్క పనితీరు, స్నాప్డ్రాగెన్ 670 మరియు స్నాప్డ్రాగెన్ 710లను తలదన్నేలా ఉంటుందని చెప్పబడుతున్న క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 675 SoC,తో రానున్న మొట్టమొదటి ఫోనుగా ఉండవచ్చు.
రెడ్మి నోట్ 7 ప్రత్యేకతలు :
ఈ స్మార్ట్ ఫోన్ 2340×1080 పిక్సెళ్ళు అందించగల ఒక 6.3-అంగుళాల LCD ప్యానల్ మరియు పైన ఒక చిన్ననోచ్ తో వస్తుంది. ఈ ఫోన్ ఒక 2.5D కర్వ్డ్ గ్లాస్ చట్రంలో ఉంచబడింది మరియు ఒక వెనుక-మౌంటు వేలిముద్ర సెన్సార్ను కలిగి ఉంది. ఈ ఫోన్ యొక్క వెనుక కెమెరా యూనిట్ కెమెరా క్రింద ఒక సింగిల్ LED ఫ్లాష్ యూనిట్టుతో ఎగువ మూలలో అమర్చబడి ఉంటుంది. పోర్ట్రైట్ షాట్ల కోసం 5MP సెకండరీ సెన్సరుతో కలిపి ఒక 48MP ప్రధాన సెన్సారుతో వుండే మొదటి Redmi ఫోన్ ఇదే. ఈ 48MP సెన్సార్ తక్కువ కాంతిలో కూడా మంచి షాట్లు తీసుకునేందుకు సహాయపడుతుందని చెబుతోంది రెడ్మి.
హుడ్ కింద, క్వాల్కమ్ స్నాప్డ్రాగెన్ 660 SoC. మరియు చైనాలో, ఈ ఫోన్ 3GB, 4GB లేదా 6GB RAM రకాలలో అందించబడుతుంది, స్టోరేజి వేరియంట్స్ గురించి చూస్తే, 32GB లేదా 64GB వంటివి ఉన్నాయి. ఒక 4,000mAh బ్యాటరీ ఈ ఫోన్ లోపల ఉంది, ఇది ముందుగా వచ్చిన ఫోన్ వలెనే ఉంటుంది. ముందు బ్యూటిఫికేషన్ మరియు పోర్ట్రైట్ మోడ్ కోసం AI అల్గోరిథంలు కలిగిన ఒక 13MP కెమెరా ఉంటుంది.ఈ రెడ్మి నోట్ 7 యొక్క 3GB + 32GB వేరియంట్ 999 యువాన్ నుండి మొదలవుతుంది (రూ. 10,381 సుమారుగా) అయితే, 4GB + 64GB వేరియంట్ ధర 1199 యువాన్ (సుమారు రూ 12,455) మరియు 6GB + 64GB వేరియంట్ 1399 యువాన్ కోసం రిటైల్ వ్యాపారం జరుగుతోంది (సుమారు రూ 14,532) .