Redmi Note 14 Pro+ : AI సపోర్ట్ మరియు స్టన్నింగ్ డిజైన్ తో లాంచ్ కన్ఫర్మ్.!
రెడ్ మీ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ ను ఈరోజు కన్ఫర్మ్ చేసింది
రెడ్ మీ 14 సిరీస్ నుంచి 14 Pro+ ను డిసెంబర్ 9న విడుదల చేస్తున్నట్లు తెలిపింది
ఈ స్మార్ట్ ఫోన్ కీలకమైన ఫీచర్స్ మరియు స్పెక్స్ తో టీజింగ్ కూడా చేస్తుంది
Redmi Note 14 Pro+ : రెడ్ మీ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ ను ఈరోజు కన్ఫర్మ్ చేసింది. రెడ్ మీ 14 సిరీస్ నుంచి 14 Pro+ స్మార్ట్ ఫోన్ ను డిసెంబర్ 9వ తేదీ ఇండియాలో విడుదల చేస్తున్నట్లు షియోమీ తెలిపింది. అంతేకాదు, ఈ స్మార్ట్ ఫోన్ కీలకమైన ఫీచర్స్ మరియు స్పెక్స్ తో టీజింగ్ కూడా చేస్తుంది. ఈ అప్ కమింగ్ రెడ్ మీ ఫోన్ కీలకమైన స్పెక్స్ మరియు ఫీచర్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
Redmi Note 14 Pro+ : లాంచ్
రెడ్ మీ నోట్ 14 ప్రో ప్లస్ స్మార్ట్ ఫోన్ ను డిసెంబర్ 9వ తేదీ ఇండియాలో విడుదల చేస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ కీలకమైన ఫీచర్స్ ను కూడా ఈ ఫోన్ లాంచ్ ఈవెంట్ పేజీ నుంచి టీజ్ చేస్తోంది. ఈ ఫోన్ ను సూపర్ కెమెరా మరియు సూపర్ AI సపోర్ట్ తో తీసుకువస్తున్నట్లు కంపెనీ టీజింగ్ చేస్తోంది.
Redmi Note 14 Pro+ : ఫీచర్స్
రెడ్ మీ నోట్ 14 ప్రో ప్లస్ స్మార్ట్ ఫోన్ ను 20+ AI ఫీచర్స్ కలిగిన సూపర్ AI తో తీసుకొస్తున్నట్లు షియోమీ తెలిపింది. ఈ ఫోన్ చాలా ఆకర్షణీయమైన డిజైన్ తో కనిపిస్తోంది. ఇందులో వెనుక ట్రిపుల్
రియర్ కెమెరా వుంది మరియు ఇందులో OIS 50MP మరియు టెలిఫోటో కెమెరా ఉన్నట్లు కూడా తెలిపింది. అంతేకాదు, ఈ కెమెరా AI సపోర్ట్ ను కలిగి ఉందని కూడా కన్ఫర్మ్ చేసింది.
ఈ ఫోన్ ను IP68 వాటర్ మరియు డస్ట్ రెసిస్టెంట్ సపోర్ట్ తో అందిస్తున్నట్లు కూడా షియోమీ కన్ఫర్మ్ చేసింది. అంతేకాదు, లేటెస్ట్ గా అందించిన టీజర్ ఇమేజ్ ద్వారా ఈ ఫోన్ లో AMOLED స్క్రీన్ మరియు దీనిపై కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్ ఉన్నట్లు కూడా కన్ఫర్మ్ అయ్యింది.
ఈ ఫోన్ యొక్క టీజర్ ఇమేజ్ ద్వారా ఈ ఫోన్ లో డ్యూయల్ స్టీరియో స్పీకర్లు ఉన్నట్లు అర్థం అవుతోంది. అలాగే, ఈ ఫోన్ చాలా స్లీక్ డిజైన్ ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ ఫోన్ లో ఒక బ్లాక్ వేరియంట్ మరియు ఒక లెథర్ వేరియంట్ ఉన్నట్లు టీజర్ పేజీ ద్వారా అర్థం అవుతోంది.
Also Read: HONOR Days Sale నుంచి హానర్ 200 5జి ఫోన్ పై భారీ తగ్గింపు ప్రకటించిన అమెజాన్.!
ఇక AI ఫీచర్స్ విషయానికి వస్తే, ఈ ఫోన్ లో AiMi తో AI సపోర్ట్ ఉన్నట్లు తెలిపింది. ఇది AI ఫోటో జెనరేషన్, AI ఎరేజ్ మరియు రియల్ టైమ్ ట్రాన్స్ లేషన్ వంటి మరిన్ని AI ఫీచర్స్ ఉన్నట్లు కూడా తెలిపింది.