Redmi Note 14 Pro+ 5G అండర్ వాటర్ కెమెరా సహా పవర్ ఫుల్ ఫీచర్స్ తో లాంచ్ అయ్యింది.!
Redmi Note 14 Pro+ 5G స్మార్ట్ ఫోన్ ను ఎట్టకేలకు లాంచ్ చేసింది
ఈ స్మార్ట్ ఫోన్ అండర్ వాటర్ కెమెరా సహా పవర్ ఫుల్ ఫీచర్స్ తో లాంచ్ అయ్యింది
ఈ షియోమీ స్మార్ట్ ఫోన్ ధర మరియు కంప్లీట్ ఫీచర్స్ తెలుసుకోండి
చాలా కాలంగా షియోమీ టీజింగ్ చేస్తున్న Redmi Note 14 Pro+ 5G స్మార్ట్ ఫోన్ ను ఎట్టకేలకు లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ అండర్ వాటర్ కెమెరా సహా పవర్ ఫుల్ ఫీచర్స్ తో లాంచ్ అయ్యింది. ఇండియన్ మార్కెట్లో సరికొత్తగా విడుదలైన ఈ షియోమీ స్మార్ట్ ఫోన్ ధర మరియు కంప్లీట్ ఫీచర్స్ తెలుసుకోండి.
Redmi Note 14 Pro+ 5G : ధర
ఈ స్మార్ట్ ఫోన్ ను మూడు వేరియంట్లలో షియోమీ లాంచ్ చేసింది. ఈ ఫోన్ యొక్క మూడు వేరియంట్ ధరలు ఈ క్రింద చూడవచ్చు.
రెడ్ మీ నోట్ 14 ప్రో ప్లస్ 5G (8GB + 128GB ) ధర : రూ. 30,999
రెడ్ మీ నోట్ 14 ప్రో ప్లస్ 5G (8GB + 256GB ) ధర : రూ. 32,999
రెడ్ మీ నోట్ 14 ప్రో ప్లస్ 5G (12GB + 512GB ) ధర : రూ. 35,999
ఈ స్మార్ట్ ఫోన్ పై ICICI బ్యాంక్ క్రెడిట్ మరియు క్రెడిట్ కార్డ్స్ EMI రూ. 1,000 ఫ్లాట్ డిస్కౌంట్ ఆఫర్ ను అందించింది. రెడ్ మీ నోట్ 14 ప్రో ప్లస్ స్మార్ట్ ఫోన్ డిసెంబర్ 13 వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి సేల్ కి అందుబాటులోకి వస్తుంది.
Redmi Note 14 Pro+ 5G : ఫీచర్స్
ఈ రెడ్ మీ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ Snapdragon 7s Gen 3 ఆక్టా కోర్ చిప్ సెట్ జతగా 12GB ర్యామ్ మరియు 512GB ఇంటర్నల్ స్టోరేజ్ ని కలిగి ఉంటుంది. ఈ ఫోన్ Android 14 OS పై HyperOS సాఫ్ట్ వేర్ తో పనిచేస్తుంది మరియు 3 మేజర్ అప్డేట్స్ మరియు 4 సంవత్సరాల సెక్యూరిటీ అప్డేట్స్ ను అందుకుంటుంది.
ఈ ఫోన్ లో 6.67 కర్వ్డ్ AMOLED స్క్రీన్ ను 120Hz రిఫ్రెష్ రేట్ తో కలిగి వుంది. ఈ స్క్రీన్ 1.5K రిజల్యూషన్, 3000 నిట్స్ పీక్ బ్రైట్నెస్, డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, Dolby Vision మరియు HDR 10 + సపోర్ట్ లను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ IP68 రేటింగ్ తో వాటర్ మరియు డస్ట్ రెసిస్టెంట్ గా ఉంటుంది.
ఇక ఈ ఫోన్ కెమెరా సెటప్ ను కూడా బాగానే అందించింది. ఈ ఫోన్ లో వెనుక 50MP (Light Fusion 800) కెమెరా, 50MP టెలిఫోటో మరియు 8MP అల్ట్రా వైడ్ కెమెరా ఉంటాయి. ఈ ఫోన్ లో ముందు 20MP సెల్ఫీ కెమెరా కూడా వుంది. ఈ ఫోన్ కలిగిన అండర్ వాటర్ ఫీచర్ తో ఈ ఫోన్ తో నీటిలో కూడా ఫోటోలు షూట్ చేయవచ్చని కంపెనీ తెలిపింది. ఈ ఫోన్ తో 30 fps వద్ద 4K వీడియోలు షూట్ చేసే అవకాశం వుంది.
Also Read: Sony Bravia Tv Days సేల్ నుంచి సోనీ బ్రావియా 3 స్మార్ట్ టీవీ పై ధమాకా ఆఫర్.!
ఈ ఫోన్ లో సరికొత్త బ్యాటరీ సెటప్ అందించింది. ఈ ఫోన్ ను 6,200 mAh బిగ్ సిలికాన్ కార్బన్ బ్యాటరీని 90W హైపర్ ఛార్జ్ సపోర్ట్ తో కలిగి ఉంటుంది. ఇందులో Dolby Atmos సపోర్ట్ కలిగిన డ్యూయల్ స్టీరియో స్పీకర్లు ఉన్నాయి.