digit zero1 awards

Redmi Note 13 Pro: భారీ డిస్కౌంట్ ఆఫర్లతో కొత్త వేరియంట్ లాంచ్.!

Redmi Note 13 Pro: భారీ డిస్కౌంట్ ఆఫర్లతో కొత్త వేరియంట్ లాంచ్.!
HIGHLIGHTS

Redmi Note 13 Pro రెడ్ కలర్ వేరియంట్ ను ఈరోజు విడుదల చేసింది

ఈ వేరియంట్ ను గొప్ప బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ తో కూడా అందించింది

ఈ ఫోన్ 67W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన 5100 mAh బిగ్ బ్యాటరీతో ఉంటుంది

Redmi Note 13 Pro: రెడ్ మీ నోట్ 13 ప్రో 5జి స్మార్ట్ ఫోన్ రెడ్ కలర్ వేరియంట్ ను ఈరోజు విడుదల చేసింది. నోట్ 13 ప్రో ఇప్పటి వరకు బ్లాక్, పర్పల్ మరియు వైట్ కలర్ ఆప్షన్ లలో మాత్రమే లభిస్తుండగా ఇప్పుడు కొత్త స్కార్లెట్ రెడ్ కలర్ వేరియంట్ ను కూడా అందించింది. అంతేకాదు, ఈ వేరియంట్ ను గొప్ప బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ తో కూడా అందించింది.

Redmi Note 13 Pro: ధర

రెడ్ మీ నోట్ 13 ప్రో స్మార్ట్ ఫోన్ స్కార్లెట్ రెడ్ కలర్ వేరియంట్ (8GB+ 128GB) ను రూ. 28,999 రూపాయల ధరతో విడుదల చేసింది. ఈ ఫోన్ పై రూ. 3,000 బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ ను కూడా అందించింది. ఈ ఫోన్ ను SBI, ICICI మరియు HDFC బ్యాంక్ కార్డ్స్ తో కొనుగోలు చేసే వారికి రూ. 3,000 డిస్కౌంట్ లభిస్తుంది. Buy From Here

Also Read: యాపిల్ డేస్ సేల్ నుండి Apple iPhone 13 పై భారీ డిస్కౌంట్ అందించిన అమెజాన్.!

Redmi Note 13 Pro: ఫీచర్లు

ఈ ఫోన్ 1.5K రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్ మరియు Dolby Vision సపోర్ట్ కలిగిన 6.7 ఇంచ్ AMOLED డిస్ప్లేతో లాంచ్ చేసింది. ఈ రెడ్ మీ ఫోన్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ మరియు 1800 నిట్స్ పీక్ బ్రైట్నెస్ తో వస్తుంది. ఈ ఫోన్ స్నాప్ డ్రాగన్ 7s జెన్ 2 చిప్ సెట్ తో పని చేస్తుంది మరియు 8GB ర్యామ్ తో పాటు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. ఈ ఫోన్ షియోమీ MIUI 14 సాఫ్ట్ వేర్ పైన ఆండ్రాయిడ్ 13 OS తో వస్తుంది.

Redmi Note 13 Pro
Redmi Note 13 Pro Features

ఈ రెడ్ మీ ఫోన్ లో వెనుక ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ వుంది. ఇందులో, OIS + EIS సపోర్ట్ కలిగిన 200MP మెయిన్ కెమెరా, 8MP అల్ట్రా వైడ్ మరియు 2MP మ్యాక్రో కెమెరాలు వున్నాయి. ఈ ఫోన్ లో 16MP 7P లెన్స్ సెల్ఫీ కెమెరా కూడా వుంది. ఈ ఫోన్ 67W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన 5100 mAh బిగ్ బ్యాటరీతో ఉంటుంది. ఈ ఫోన్ లో అందించిన ఫింగర్ ప్రింట్ సెన్సార్ హార్ట్ రేట్ డిటెక్షన్ ఫీచర్ ను కూడా కలిగి ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo