Redmi Note 13 Pro Plus భారీ తగ్గింపు అందుకుంది: కొత్త ప్రైస్ తెలుసుకోండి.!
Redmi Note 13 Pro Plus ఇప్పుడు భారీ తగ్గింపు అందుకుంది
30 వేల బడ్జెట్ ధరలో విడుదలైన ఈ ఫోన్ ఇప్పుడు 21 వేల బడ్జెట్ లో లభిస్తుంది
ఈ ఫోన్ కొత్త ప్రైస్ మరియు అప్డేట్ ను తెలుసుకోండి
Redmi Note 13 Pro Plus ఇప్పుడు భారీ తగ్గింపు అందుకుంది. ఈ సంవత్సరం ప్రారంభంలో 30 వేల బడ్జెట్ ధరలో ఇండియన్ మార్కెట్లో విడుదలైన ఈ ఫోన్ ఇప్పుడు 25 వేల బడ్జెట్ లో లభిస్తుంది. ఈ ఫోన్ ను బ్యాంక్ ఆఫర్ తో కలిపి 21 వేల రూపాయల బడ్జెట్ లో అందుకోవచ్చు. ఈ ఫోన్ కొత్త ప్రైస్ మరియు అప్డేట్ ను తెలుసుకోండి.
Redmi Note 13 Pro Plus : ఆఫర్ ధర
రెడ్ మీ నోట్ 13 ప్రో ప్లస్ స్మార్ట్ ఫోన్ ఇండియాలో రూ. 27,999 ప్రారంభ ధరతో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ ఇప్పుడు ఫ్లిప్ కార్ట్ నుండి భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 22,794 రూపాయల ఆఫర్ ధరకే లభిస్తోంది. ఈ ఫోన్ HDFC Bank Pixel Credit Card EMI ఆఫర్ తో కొనుగోలు చేసే వారికి రూ. 1,500 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా లభ్గిస్తుంది.
అంటే, డిస్కౌంట్ మరియు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ తో కలిపి ఈ స్మార్ట్ ఫోన్ ను కేవలం రూ. 21,294 రూపాయల ఆఫర్ ధరకు అందుకోవచ్చు. అంతేకాదు, ఈ స్మార్ట్ ఫోన్ పై ఎక్స్ చేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో వుంది.
Redmi Note 13 Pro Plus : ఫీచర్స్
ఈ రెడ్ మీ స్మార్ట్ ఫోన్ Dimensity 7200 Ultra 5G 4nm చిప్ సెట్ తో పని చేస్తుంది. దీనికి జతగా 8GB ర్యామ్ మరియు 256GB ఇంటర్నల్ స్టోరేజ్ ను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 1.5K Curved AMOLED స్క్రీన్ ను కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్ మరియు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ను కలిగి ఉంటుంది.
రెడ్ మీ నోట్ 13 ప్రో స్మార్ట్ ఫోన్ లో వెనుక ట్రిపుల్ కెమెరా వుంది. ఈ ఇందులో 200MP (OIS) మెయిన్ + 8MP అల్ట్రా వైడ్ + 2MP మ్యాక్రో కెమెరాలు ఉన్నాయి. ఈ ఫోన్ తో 30 fps వద్ద 4K వీడియోలు షూట్ చేయవచ్చు మరియు గొప్ప ఫోటోలు షూట్ చేయవచ్చు.
Also Read: Jio Best Plan: నెలకు రూ. 300 ఖర్చుతోనే అన్లిమిటెడ్ లాభాలు అందుకోండి.!
ఈ ఫోన్ లో 120W అల్ట్రా ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగిన 500 mAh బిగ్ బ్యాటరీ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ IP68 రేటింగ్ తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్ గా ఉంటుంది. అంతేకాదు, ఈ ఫోన్ వేగాన్ లెథర్ తో ఆకర్షణీయమైన డిజైన్ తో కూడా ఉంటుంది.