1.5K Curved AMOLED డిస్ప్లేతో వస్తున్న Redmi Note 13 Pro+ స్మార్ట్ ఫోన్.!

1.5K Curved AMOLED డిస్ప్లేతో వస్తున్న Redmi Note 13 Pro+ స్మార్ట్ ఫోన్.!
HIGHLIGHTS

రెడ్ మి నోట్ 13 సిరీస్ లాంచ్ కోసం డేట్స్ అనౌన్స్ చేసిన షియోమి

ఈ ఫోన్ ప్రత్యేకతలను ఒక్కొక్కటిగా విడుదల చేయడం మొదలు పెట్టింది

Redmi Note 13 Pro+ ఫోన్ ను 1.5K Curved AMOLED డిస్ప్లేతో విడుదల చేస్తున్నట్లు తెలిపింది

రెడ్ మి నోట్ 13 సిరీస్ లాంచ్ కోసం డేట్స్ అనౌన్స్ చేసిన షియోమి ఈ ఫోన్ ప్రత్యేకతలను ఒక్కొక్కటిగా విడుదల చేయడం మొదలు పెట్టింది. రెడ్ మి నోట్ 13 5జి స్మార్ట్ ఫోన్ సిరీస్ నుండి కొత్త స్మార్ట్ ఫోన్ లను జనవరి 4న విడుదల చేసినట్లు కంపెనీ ప్రకటించింది. ఈ సిరీస్ నుండి Redmi Note 13 Pro+ స్మార్ట్ ఫోన్ ను 1.5K Curved AMOLED డిస్ప్లేతో విడుదల చేస్తున్నట్లు తెలిపింది. అంతేకాదు, షియోమి కొత్త ఫోన్ యోక్క కొన్ని ప్రత్యేకతలతో టీజింగ్ కూడా మొదలు పెట్టింది.

Redmi Note 13 Pro+

రెడ్ మి నోట్ 13 ప్రో+ 5జి స్మార్ట్ ఫోన్ యొక్క టీజర్ ద్వారా ఈ ఫోన్ డైజైన్ గురించి ముందుగా వివరాలను వెల్లడించిన కంపెనీ, ఇప్పుడు మరొ రెండు ప్రత్యేకతలను కూడా బయట పెట్టింది. ఈ ఫోన్ ను ప్రీమియం లెథర్ బ్యాక్ ప్యానల్ ను మల్టి కలర్ లతో అందిస్తున్నట్లు టీజర్ ఇమేజ్ ద్వారా వేల్లడించిన షియోమి, ఈ ఫోన్ డిస్ప్లే మరియు కెమేరా వివరాలను ఇప్పుడు వెల్లడించింది.

1.5K Curved AMOLED

Redmi Note 13 Pro+ with 1.5K Curved AMOLED display
రెడ్ మి నోట్ 13 ప్రో+

రెడ్ మి నోట్ 13 ప్రో+ స్మార్ట్ ఫోన్ ను 1.5 K క్రిస్టల్ రిజల్యూషన్ కలిగిన AMOLED డిస్ప్లేతో ఈ ఫోన్ లాంచ్ చేస్తునట్లు, టీజర్ ఇమేజ్ మరియు వివరాలను బయట పెట్టింది. ఈ టీజర్ ఇమేజ్ ద్వారా ఈ ఫోన్ సెంటర్ పంచ్ హోల్ డిజైన్ ను కలిగి వుంది. అలాగే, ఈ ఫోన్ సన్నగా స్లీక్ డిజైన్ ను కలిగి ఉన్నట్లు కూడా అర్ధమవుతోంది. అలాగే, ఈ ఫోన్ అడుగున Type-C ఛార్జ్ పోర్ట్, మైక్రో ఫోన్, సిమ్ కార్డ్ ట్రే, స్పీకర్ గ్రిల్ వంటివి కనిపిస్తున్నాయి.

Also Read : Apple iPhone వాడుతున్న వారికి ప్రభుత్వ హెచ్చరిక.!

200Mega OIS Camera

Redmi Note 13 Pro+ with 200 mega ois camera
రెడ్ మి నోట్ 13 ప్రో+

ఈ ఫోన్ లో 200Mega OIS మెయిన్ కెమేరా కలిగిన ట్రిపుల్ రియర్ కెమేరా సెటప్ ఉన్నట్లు కూడా టీజర్ ఇమేజ్ ద్వారా వెల్లడించింది. అంతేకాదు, ఈ ఫోన్ ను టీజర్ ఇమేజ్ ద్వారా వాటర్ రెసిస్టెంట్ ఫీచర్ తో కూడా వస్తున్నట్లు మనం అర్ధం చేసుకోవచ్చు. ఎందుకంటే, ఈ ఫోన్ ను పూర్తిగా నీటిలో మునిగివున్నట్లు కంపెనీ టీజర్ ఇమేజ్ లలో చూపిస్తోంది.

ఈ ఫోన్ యొక్క మరొక ఫీచర్ ను డిసెంబర్ 19న రివీల్ చేస్తుందని షియోమి తెలిపింది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo