భారత మార్కెట్ లో రెడ్ మి నోట్ సిరీస్ స్మార్ట్ ఫోన్ లను విడుదల చేస్తోంది. ఈ ఫోన్ లను జనవరి 4 న విడుదల చేస్తునట్లు కంపెనీ ప్రకటించగా, ఈ ఫోన్స్ లాంచ్ కంటే ముందే ధర వివరాలు లీక్ అయ్యాయి. ఈ సిరీస్ నుండి రెండు స్మార్ట్ ఫోన్ లను విడుదల చేస్తునట్లు షియోమి అనౌన్స్ చెయ్యగా, వీటిలో Redmi Note 13 Pro రేటు ఇప్పుడు ఆన్లైన్ లీక్ అయ్యింది.
ప్రముఖ టిప్స్టర్ అభిషేక్ యాదవ్ ఈ ఫోన్ ధర వివరాలను తన ట్విట్టర్ అకౌంట్ ను ట్వీట్ చేశారు. ఈ ఫోన్ యొక్క 12GB+256GB వేరియంట్ బాక్స్ ప్రైస్ ను రూ. 32,999 అని ధర వివరాలను లీక్ చేశారు. అంతేకాదు, ఈ ఫోన్ యొక్క చైనీస్ వేరియంట్ కంప్లీట్ స్పెక్స్ షీట్ ను కూడా ఈ ట్వీట్ నుండి షేర్ చేశారు.
అంటే, ఈ ట్వీట్ ను బట్టి ఈ స్మార్ట్ ఫోన్ దాదాపుగా చైనీస్ లో విడుదలైనరెడ్ మి నోట్ 13 ప్రో వేరియంట్ ను పోలి ఉంటుందని చెబుతన్నట్లు అనిపిస్తోంది. అయితే, ఈ ఫోన్ లాంచ్ కావడానికి ఇంకా సమయం ఉన్నది కాబట్టి అధికారిక వివరాల కోసం వేచి చూడవలసి ఉంటుంది.
Also Read : X-mas Gift Idea: మీకు నచ్చిన వారికి బడ్జెట్ ధరలో మంచి గిఫ్ ఇవ్వాలనుకుంటున్నారా.!
రెడ్ మి నోట్ 13 ప్రో స్మార్ట్ ఫోన్ ను 6.67 ఇంచ్ సైజు గల 1.5K రిజల్యూషన్ OLED డిస్ప్లేతో లాంచ్ చేసింది. ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ Snapdragon 7s Gen 2 ప్రోసెసర్ తో వచ్చింది మరియు ఇండియన్ వేరియంట్ లో కూడా ఇదే ప్రోసెసర్ ఉన్నట్లు కంపెనీ తెలిపింది. ఈ ఫోన్ లో 200MP OIS Samsung HP3 మెయిన్ కెమేరా జతగా 8MP+2MP కెమేరాలతో ట్రిపుల్ కెమేరా సెటప్ వుంది.
రెడ్ మి నోట్ 13 ప్రో చైనీస్ వేరియంట్ 67W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన 5100 బ్యాటరీని కలిగి వుంది. ఇందులో, X-axis లైనర్ మోటార్, డ్యూయల్ స్టీరియో స్పీకర్లు మరియు IP54 రేటింగ్ వంటి మరిన్ని ఫీచర్లు ఉన్నాయి.
అయితే, ఇండియన్ వేరియంట్ వివరాలు షియోమి పూర్తిగా వెల్లడించ లేదు.