Redmi Note 13 Pro+ 5G ఫోన్ ను వాటర్ రెసిస్టెంట్ వంటి భారీ ఫీచర్లతో లాంచ్ చేస్తున్నట్లుషియోమి టీజర్ ద్వారా వెల్లడవుతోంది. జనవరి 4న రెడ్ మి నోట్ 13 సిరీస్ నుండి కొత్త స్మార్ట్ ఫోన్ లను విడుదల చేస్తున్నట్లు షియోమి అనౌన్స్ చేసింది. ఈ ఫోన్ యొక్క టీజర్ పేజ్ నుండి ఈ ఫోన్ కీలకమైన ఫీచర్లను ఒక్కొక్కటిగా షియోమి ప్రకటిస్తోంది. ఇప్పటి వరకూ డిజైన్ మరియు డిస్ప్లే ఫీచర్లను మాత్రమే తెలిపిన షియోమి ఈ ఫోన్ యొక్క మరొక ఫీచర్ ను కూడా వెల్లడించింది.
రెడ్ మి నోట్ 13 ప్రో+ 5జి స్మార్ట్ ఫోన్ ను IP68 వాటర్ రెసిస్టెంట్ సపోర్ట్ తో లాంచ్ చేస్తున్నట్లు కంపెనీ బయట పెట్టింది. కొత్తగా తెలిపిన ఈ ఫీచర్ ద్వారా ఈ ఫోన్ డస్ట్ మరియు వాటర్ నుండి సురక్షితమైన డిజైన్ తో వస్తున్నట్లు క్లియర్ చేసింది. వాస్తవానికి, రెడ్ మి నోట్ 13 సిరీస్ ఫోన్లను చైనా మార్కెట్ లో షియోమి ముందుగానే విడుదల చేసింది. ఇప్పటి వరకూ కంపెనీ తెలిపిన స్పెక్స్ అన్ని కూడా చైనా వేరియంట్ ను పొలి ఉన్నాయి.
ఇండియన్ వేరియంట్ గురించి కంపెనీ తెలిపిన వివరాలలో, ఈ ఫోన్ 120W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ తో వస్తున్నట్లు కూడా తెలిపింది. ఈ ఫోన్ లో 200MP Mega OIS భారీ ట్రిపుల్ కెమేరా సెటప్ కూడా వుంది. ఇది మాత్రమే కాదు, ఈ ఫోన్ లెథర్ బ్యాక్ ప్యానల్ డిజైన్ మరియు 1.5K రిజల్యూషన్ కర్వ్డ్ డిస్ప్లే వంటివి ఉన్నాయి.
Also Read : Xmas Narzo Sale: రియల్ మి ఫోన్ల పైన భారీ డిస్కౌంట్ ఆఫర్లు అందుకోండి.!
రెడ్ మి నోట్ 13 ప్రో + 5జి ఫోన్ చైనా వేరియంట్ Gorilla glass Victus రక్షణతో 1.5K రిజల్యూషన్ డిస్ప్లేని 120Hz రిఫ్రెష్ రేట్ తో కలిగి వుంది. ఈ ఫోన్ కంపెనీ Heart rate detection సపోర్ట్ తో కూడా అందించింది. 200MP+ 8MP అల్ట్రా వైడ్ + 2MP మ్యాక్రో లెన్స్ కలిగిన ట్రిపుల్ కెమేరా ఈ ఫోన్ లో వుంది. ఇది 4K video రికార్డింగ్ సపోర్ట్ తో వస్తుంది.
ఈ ఫోన్ లో 5000mAh బిగ్ బ్యాటరీని 120W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ తో కూడా అందించింది. ఈ ఫోన్ లో Dolby Atmos సపోర్ట్ కూడా వుంది. ఈ ఫోన్ ను చైనా మార్కెట్ లో Dimensity 7200-Ultra ప్రోసెసర్ తో లాంచ్ చేసింది షియోమి.
అయితే, ఇండియాలో ఎటువంటి వివరాలతో లాంచ్ చేస్తుందో వేచి చూడాలి.