రెడ్ మి నోట్ 13 సిరీస్ నుండి కొత్త ఫోన్ ను విడుదల చెయ్యడానికి షియోమి డేట్ అనౌన్స్ చేసింది. Redmi Note 13 Pro+ 5G స్మార్ట్ ఫోన్ ను జనవరి 4వ తేదీ ఇండియన్ మార్కెట్ లో లాంచ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ టీజర్ ఇమేజ్ తో షియోమి అధికారిక వెబ్సైట్ నుండి టీజింగ్ ను కూడా ప్రారంభించింది. కంపెనీ అందించింది టీజర్ ఇమేజ్ ద్వారా ఈ ఫోన్ 200MP మెగా OIS కెమేరాతో వస్తున్నట్లు కన్ఫర్మ్ అయ్యింది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ యొక్క మరిన్ని వివరాల పైన ఒక లుక్కేద్దాం పదండి.
రెడ్ మి నోట్ 13 ప్రో+ 5జి స్మార్ట్ ఫోన్ ఇండియన్ లాంచ్ ఈవెంట్ జనవరి 4న జరుగుతుందని కంపెనీ అనౌన్స్ చేసింది. ఈ ప్రకటనతో పాటుగా ఈ ఫోన్ టీజర్ పేజ్ ను కూడా షియోమి అందించింది. ఈ టీజర్ పేజ్ నుండి అందించిన ఇమేజ్ ద్వారా ఈ ఫోన్ అందమైన లెథర్ డిజైన్ తో వస్తున్నట్లు మనం అర్ధం చేసుకోవచ్చు.
రెడ్ మి నోట్ 13 ప్రో+ 5జి సన్నగా మరియు కొత్త డిజైన్ తో ఆకర్షణీయంగా కనిపిస్తోంది. అంతేకాదు, ఈ ఫోన్ ను వాటర్ రెసిస్టెంట్ డిజైన్ ను కలిగి ఉన్నట్లుగా కూడా ఊహిస్తున్నారు. ఎందుకంటే, టీజర్ ఇమేజ్ లో ఈ ఫోన్ సగం నీటిలో మునిగి ఉన్నట్లు చూపిస్తోంది షియోమి.
Also Read : Samsung Galaxy M34 5G పైన భారీ కూపన్ ఆఫర్ ప్రకటించిన అమేజాన్.!
రెడ్ మి నోట్ 13 ప్రో+ 5జి స్మార్ట్ ఫోన్ ను వెనుక డ్యూయల్ ఫ్లాష్ తో జతగా భారీ ట్రిపుల్ కెమేరా సెటప్ కనిపిస్తోంది. ఇందులో ఆప్టిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ కలిగిన 200MP మెగా కెమేరా ఉన్నట్లు ఇమేజ్ ద్వారా కన్ఫర్మ్ చేసింది. ఈ సిరీస్ నుండి మరొక ఫోన్ ను కూడా లాంచ్ చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది.
ఈ ఫోన్ డిజైన్ కూడా ఈ ఇమేజ్ ద్వారా క్లియర్ గా తెలిసిపోతోంది. ఎందుకంటే, ఈ ఫోన్ ప్రీమియం లెథర్ బ్యాక్ ను మల్టిపుల్ కలర్ లతో కలిగి వుంది. ఈ కలర్ మరియు డిజైన్ ఈ ఫోన్ ను యూనిక్ గా ఉండేలా చేస్తున్నాయి. అలాగే, రైట్ సైడ్ లో వాల్యూమ్ మరియు పవర్ బటన్ ఉన్నట్లు కూడా మనం చూడవచ్చు.
ఈ ఫోన్ లాంచ్ కోసం ఇంకా చాలా సమయం వుంది కాబట్టి, మరిన్ని ఫీచర్లను ఒక్కొక్కటిగా విడుదల చేసే వీలుంది. ఈ ఫోన్ యొక్క ఒక ఫీచర్ ను రేపు విడుదల చేస్తుందని కంపెనీ చెబుతోంది.