digit zero1 awards

Redmi Note 13 Pro 5G అందమైన కొత్త రెడ్ కలర్ వేరియంట్ లో లాంచ్ అవుతోంది.!

Redmi Note 13 Pro 5G అందమైన కొత్త రెడ్ కలర్ వేరియంట్ లో లాంచ్ అవుతోంది.!
HIGHLIGHTS

రెడ్ మీ నోట్ 13 ప్రో కొత్త కలర్ వేరియంట్ ను లాంచ్ చేస్తోంది

కొత్త స్కార్లెట్ రెడ్ కలర్ వేరియంట్ ను విడుదల చేస్తోంది

అందమైన రెడ్ అండ్ బ్లాక్ లుక్ లో తీసుకు వస్తోంది రెడ్ మీ

Redmi Note 13 Pro 5G: ఈ సంవత్సరం ప్రారంభంలో 200MP ట్రిపుల్ కెమెరా తో షియోమీ తెచ్చిన రెడ్ మీ నోట్ 13 ప్రో కొత్త కలర్ వేరియంట్ ను లాంచ్ చేస్తోంది. రెడ్ మీ నోట్ 13 ప్రో యొక్క కొత్త స్కార్లెట్ రెడ్ కలర్ వేరియంట్ ను విడుదల చేస్తోంది. ఈ కొత్త కలర్ వేరియంట్ ను చాలా అందమైన రెడ్ అండ్ బ్లాక్ లుక్ లో తీసుకు వస్తోంది రెడ్ మీ.

Redmi Note 13 Pro 5G: స్కార్లెట్ రెడ్ వేరియంట్

రెడ్ మీ నోట్ 13 ప్రో 5జి స్కార్లెట్ రెడ్ వేరియంట్ ను జూన్ 25 వ తేదీన లాంచ్ చేస్తుంది. ఈ ఫోన్ ప్రైస్ మరియు ఫీచర్స్ పరంగా పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు. ఈ ఫోన్ 2024 జనవరి లో భారత మార్కెట్లో విడుదల చేయబడింది మరియు ఇప్పుడు కొత్త కలర్ వేరియంట్ లో కూడా వస్తోంది.

Redmi Note 13 Pro 5G
Redmi Note 13 Pro 5G

ధర:

రెడ్ మీ నోట్ 13 ప్రో స్మార్ట్ ఫోన్ ప్రస్తుతం రూ. 24,999 రూపాయల ప్రారంభ ధరలో లభిస్తోంది. ఈ ఫోన్ మూడు వేరియంట్లలో లభిస్తుంది మరియు పైన తెలిపిన ధర (8GB + 128GB) బేసిక్ వేరియంట్ ధర. ఈ ఫోన్ మరో రెండు స్టోరేజ్ వేరియంట్లలో కూడా లభిస్తుంది.

Also Read: JBL Live Beam 3: టచ్ స్క్రీన్ కలిగిన స్మార్ట్ కేస్ తో కొత్త బడ్స్ లాంచ్ చేసిన జేబీఎల్.!

Redmi Note 13 Pro 5G: ఫీచర్లు

రెడ్ మీ ఈ ఫోన్ ను 200MP ట్రిపుల్ రియర్ కెమెరాతో తో అందించింది. ఈ ఫోన్ కొత్త స్నాప్ డ్రాగన్ 7s జెన్ 2 చిప్ సెట్ తో నడుస్తుంది మరియు 8GB/12GB ర్యామ్ మరియు 128GB/256GB స్టోరేజ్ ఆప్షన్ లతో వస్తుంది. ఈ ఫోన్ లో 120Hz రిఫ్రెష్ రేట్ మరియు 1.5K రిజల్యూషన్ కలిగిన 6.7 ఇంచ్ AMOLED స్క్రీన్ ఉంది. ఈ ఫోన్ స్క్రీన్ గొరిల్లా గ్లాస్ విక్టస్ గ్లాస్ రక్షణలో ఉంటుంది మరియు Dolby Vision సపోర్ట్ తో వస్తుంది.

ఈ ఫోన్ లో వెనుక 200MP (Samsung ISOCELL HP3) మెయిన్ కెమెరా, 8MP అల్ట్రా వైడ్ మరియు 2MP మ్యాక్రో కెమెరా లతో ఉంటుంది. ఈ ఫోన్ లో ముందు 16MP సెల్ఫీ కెమెరా కూడా ఉంది. ఈ ఫోన్ లో 67W టర్బో ఛార్జ్ సూపర్ ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన 5100mAh బిగ్ బ్యాటరీ కూడా వుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo