రెడ్ మి 13 సిరీస్ ఇండియా లాంచ్ డేట్ ను అనౌన్స్ చేసిన షియోమి, ఈ సిరీస్ నుండి వస్తున్న ఫోన్ స్పెక్స్ ను కూడా వెల్లడించింది. కొత్తగా అందించి టీజర్ ద్వారా Redmi Note 13 Pro+ 5G స్మార్ట్ ఫోన్ యొక్క కీలకమైన స్పెక్స్ మరియు ఫీచర్లను వెల్లడించింది. ఈ ఫోన్ ను 200MP OIS కెమేరా సెటప్ తో తీసుకు వస్తున్నట్లు కంపెనీ అనౌన్స్ చేసింది. ఇందులో వున్న మరిన్ని ప్రత్యేకలను కూడా లాంచ్ కంటే ముందుగానే బయటపెట్టింది షియోమి.
రెడ్ మి నోట్ 13 ప్రో + స్మార్ట్ ఫోన్ ను Flipkart ప్రత్యేకంగా తీసుకు వస్తోంది కంపెనీ. అందుకే, ఈ ఫోన్ కోసం ప్రత్యేకమైన మైక్రో సైట్ పేజ్ నుండి అందించింది ఫ్లిప్ కార్ట్. ఈ పేజ్ నుండి ఈ ఫోన్ యొక్క కీలకమైన స్పెక్స్ తో టీజింగ్ చేస్తోంది. ఈ టీజర్ పేజ్ ద్వారా అందించిన అన్ని వివరాలను ఈరోజు వివరంగా చూద్దాం పదండి.
Also Read : Gold Rate Hiked: ఘోరంగా పెరిగిన బంగారం ధర..ఈరోజు రేటు ఎంతంటే.!
రెడ్ మి నోట్ 13 ప్రో+ 5జి స్మార్ట్ ఫోన్ ను ఐ క్యాచీ డిజైన్ మరియు IP68 వాటర్ రెసిస్టెంట్ డిజైన్ తో లాంచ్ చేస్తున్నట్లు తెలిపింది. ఈ ఫోన్ 1.5K 3D Curved డిస్ప్లేతో వస్తున్న రెడ్ మి మొదటి ఫోన్ అని కూడా కంపెనీ తెలిపింది. ఈ ఫోన్ ను 200 మెగా పిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమేరాని OIS సపోర్ట్ తో తీసుకు వస్తున్నట్లు షియోమి అనౌన్స్ చేసింది.
ఈ ఫోన్ డిస్ప్లేని అత్యంత కఠినమైన గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్ తో తీసుకు వస్తోంది షియోమి. ఈ ఫోన్ లో 120W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ ఉన్నట్లు మరియు ఈ ఫోన్ కేవలం 19 నిముషాల్లోనే 100% ఛార్జ్ అవుతుందని కూడా కంపెనీ తెలిపింది. ఈ రెడ్ మి ఫోన్ ను MediaTek Dimesnity 7200 Ultra ప్రోసెసర్ తో లాంచ్ చేస్తున్నట్లు టీజర్ ద్వారా షియోమి అనౌన్స్ చేసింది.