200MP OIS కెమేరా మరియు 120W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ తో వస్తున్న Redmi Note 13 Pro+ 5G
Redmi Note 13 Pro+ 5G యొక్క కీలకమైన స్పెక్స్ మరియు ఫీచర్లను వెల్లడించింది
ఈ ఫోన్ ను 200MP OIS కెమేరా సెటప్ తో తీసుకు వస్తున్నట్లు అనౌన్స్ చేసింది
ఐక్యాచీ డిజైన్ మరియు IP68 వాటర్ రెసిస్టెంట్ డిజైన్ తో లాంచ్ చేస్తున్నట్లు తెలిపింది
రెడ్ మి 13 సిరీస్ ఇండియా లాంచ్ డేట్ ను అనౌన్స్ చేసిన షియోమి, ఈ సిరీస్ నుండి వస్తున్న ఫోన్ స్పెక్స్ ను కూడా వెల్లడించింది. కొత్తగా అందించి టీజర్ ద్వారా Redmi Note 13 Pro+ 5G స్మార్ట్ ఫోన్ యొక్క కీలకమైన స్పెక్స్ మరియు ఫీచర్లను వెల్లడించింది. ఈ ఫోన్ ను 200MP OIS కెమేరా సెటప్ తో తీసుకు వస్తున్నట్లు కంపెనీ అనౌన్స్ చేసింది. ఇందులో వున్న మరిన్ని ప్రత్యేకలను కూడా లాంచ్ కంటే ముందుగానే బయటపెట్టింది షియోమి.
Redmi Note 13 Pro+ 5G with 200MP OIS Camera
రెడ్ మి నోట్ 13 ప్రో + స్మార్ట్ ఫోన్ ను Flipkart ప్రత్యేకంగా తీసుకు వస్తోంది కంపెనీ. అందుకే, ఈ ఫోన్ కోసం ప్రత్యేకమైన మైక్రో సైట్ పేజ్ నుండి అందించింది ఫ్లిప్ కార్ట్. ఈ పేజ్ నుండి ఈ ఫోన్ యొక్క కీలకమైన స్పెక్స్ తో టీజింగ్ చేస్తోంది. ఈ టీజర్ పేజ్ ద్వారా అందించిన అన్ని వివరాలను ఈరోజు వివరంగా చూద్దాం పదండి.
Also Read : Gold Rate Hiked: ఘోరంగా పెరిగిన బంగారం ధర..ఈరోజు రేటు ఎంతంటే.!
రెడ్ మి నోట్ 13 ప్రో+ 5జి స్మార్ట్ ఫోన్ ను ఐ క్యాచీ డిజైన్ మరియు IP68 వాటర్ రెసిస్టెంట్ డిజైన్ తో లాంచ్ చేస్తున్నట్లు తెలిపింది. ఈ ఫోన్ 1.5K 3D Curved డిస్ప్లేతో వస్తున్న రెడ్ మి మొదటి ఫోన్ అని కూడా కంపెనీ తెలిపింది. ఈ ఫోన్ ను 200 మెగా పిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమేరాని OIS సపోర్ట్ తో తీసుకు వస్తున్నట్లు షియోమి అనౌన్స్ చేసింది.
ఈ ఫోన్ డిస్ప్లేని అత్యంత కఠినమైన గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్ తో తీసుకు వస్తోంది షియోమి. ఈ ఫోన్ లో 120W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ ఉన్నట్లు మరియు ఈ ఫోన్ కేవలం 19 నిముషాల్లోనే 100% ఛార్జ్ అవుతుందని కూడా కంపెనీ తెలిపింది. ఈ రెడ్ మి ఫోన్ ను MediaTek Dimesnity 7200 Ultra ప్రోసెసర్ తో లాంచ్ చేస్తున్నట్లు టీజర్ ద్వారా షియోమి అనౌన్స్ చేసింది.