Redmi Note 13 5G స్మార్ట్ ఫోన్ ఈరోజు ఇండియన్ మార్కెట్ లో లాంఛ్ అయ్యింది. ఈ కొత్త స్మార్ట్ ఫోన్ ను ఆకర్షణీయమైన ధరలో ఆకట్టుకునే ఫీచర్లతో లాంచ్ చేసినట్లు షియోమి చెబుతోంది. ఈ ఫోన్ గురించి చాలా కాలంగా షియోమి టీజింగ్ చేస్తోంది మరియు ఈరోజు ఎట్టకేలకు విడుదల చేసింది. ఈ ఫోన్ కలిగి ఉన్న టాప్ ఫీచర్లు మరియు ధర వివరాలు ఎలా ఉన్నాయో ఒక లుక్కేయండి.
రెడ్ మి నోట్ 15 5జి స్మార్ట్ ఫోన్ ను 6GB, 8GB మరియు 12GB వేరియంట్ లలో విడుదల చేసింది. ఈ ఫోన్ వేరియంట్ ధరల వివరాలను ఇక్కడ చూడవచ్చు.
రెడ్ మి నోట్ 15 5జి (6GB + 128GB) వేరియంట్ ధర రూ. 17,999
రెడ్ మి నోట్ 15 5జి (8GB + 256GB) వేరియంట్ ధర రూ. 19,999
రెడ్ మి నోట్ 15 5జి (12GB + 256GB) వేరియంట్ ధర రూ. 21,999
ఈ ఫోన్ పైన బ్యాంక్ మరియు ఎక్స్ చేంజ్ ఆఫర్లను షియోమి అందించింది. ఈ ఫోన్ ను ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ & డెబిట్ కార్డ్ మరియు EMI ఆప్షన్ తో కొనేవారికి రూ. 1,000 డిస్కౌంట్ లభిస్తుంది. అంతేకాదు, ఎక్స్ చేంజ్ పైన రూ. 1,000 రూపాయల అధనపు బోనస్ ను లాంచ్ ఆఫర్ లో భాగంగా ప్రకటించింది. రెడ్ మి నోట్ 15 5జి స్మార్ట్ ఫోన్ మొదటి సేల్ జనవరి 10 న ప్రారంభమవుతుంది.
ఈ రెడ్ మి కొత్త ఫోన్ 6.67 ఇంచ్ FHD+ AMOLED డిస్ప్లేని 120Hz రిఫ్రెష్ రేట్ మరియు 1000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ తో కలిగి ఉంటుంది. అంతేకాదు, ఈ డిస్ప్లే DCI P3: 100% సపోర్ట్ తో గొప్ప కలర్ లను అందించ గలదు.
రెడ్ మి నోట్ 15 స్మార్ట్ ఫోన్ MediaTek Dimensity 6080 ఆక్టా కోర్ 5G ప్రోసెసర్ తో పని చేస్తుంది. ఇది 6nm ఫ్యాబ్రికేషన్ చిప్ సెట్ మరియు మంచి పెర్ఫార్మెన్స్ ను అందిస్తుంది.
Also Read : 2024 Jio best Offer: రూ. 200 లోపలే 12 OTT లు మరియు డేటా అందుకోండి.!
ఈ ఫోన్ 6GB మొదలు కొని 12GB వరకూ RAM ను మరియు 8GB వరకూ వర్చువల్ ర్యామ్ ను ఫీచర్ ను కూడా కలిగి వుంది. ఈ ఫోన్ 128 GB మరియు 256 GB స్టోరేజ్ ఆప్షన్ లను వుంది. అంటే, ఈ ఫోన్ వేగంగా ఉండేందుకు తగిన ర్యామ్ మరియు ఎక్కువ స్టోరేజ్ ను ఈ ఫోన్ కలిగి వుంది.
ఈ ఫోన్ లో వెనుక 108 MP మెయిన్ + 8 MP అల్ట్రా వైడ్ + 2 MP మ్యాక్రో సెన్సార్ తో ట్రిపుల్ కెమేరా సెటప్ ను కలిగి వుంది. ఈ కెమేరాతో 1080p రిజల్యూషన్ తో 30fps వీడియోలను షూట్ చేయవచ్చు. ఇందులో, 3X In-Sensor Zoom, ఫిల్మ్ ఫిల్టర్స్ మరియు స్లోమోషన్ వంటి మరిన్ని ఫీచర్లతో వస్తుంది. ఈ ఫోన్ లో ముందు 16 MP సెల్ఫీ కెమేరా కూడా వుంది.
ఈ ఫోన్ లో అందించిన ఇతర ఫీచర్ల విషయానికి వస్తే, ఇందులో IR Blaster మరియు Dolby Atmos సపోర్ట్ ను కూడా కలిగి వుంది. ఈ ఫోన్ లో 5000 mAh బ్యాటరీని 33W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ తో కలిగి వుంది.