ఈరోజు షియోమి ఇండియాలో Redmi Note 12 స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ రెడ్ నోట్ 12 సిరీస్ లో బేసిక్ 4G స్మార్ట్ ఫోన్ గా వచ్చింది. అయితే, ఈ స్మార్ట్ ఫోన్ ను సూపర్ డిజైన్ మరియు Super AMOLED డిస్ప్లే వంటి ఫీచర్లతో ఇండియన్ మార్కెట్ లో విడుదల చేసినట్లు కంపెనీ తెలిపింది. ఈరోజే సరికొత్తగా విడుదలైన ఈ షియోమి స్మార్ట్ ఫోన్ ధర, స్పెక్స్ మరియు ఫీచర్లు తెలుసుకోండి.
రెడ్ మి నోట్ 12 4G స్మార్ట్ ఫోన్ బేసిక్ వేరియంట్ 6GB ర్యామ్ మరియు 64GB స్టోరేజ్ తో రూ.14,999 రూపాయల ధరతో లాంచ్ అయ్యింది. మరొక వేరియంట్ 6GB ర్యామ్ మరియు 128GB స్టోరేజ్ తో ధర రూ.16,999 ధరతో వచ్చింది. ఈ ఫోన్ యొక్క ఫస్ట్ సేల్ ఏప్రిల్ 6వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు Flipkart మరియు mi స్టోర్ జరగుతుంది.
ఆఫర్స్:
ఈ ఫోన్ పైన గొప్ప లాంచ్ ఆఫర్లను కూడా కంపెనీ అందించింది. ఈ ఫోన్ ను ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ మరియు EMI తో కొనేవారికి 1,000 రూపాయల డిస్కౌంట్ లభిస్తుంది.
Redmi Note 4G ఫోన్ 6.5-ఇంచ్ FHD+ రిజల్యూషన్ కలిగిన Super AMOLED డిస్ప్లేని కలిగి ఉంది. ఈ డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్ మరియు 1200 నిట్స్ పీక్ బ్రైట్నెస్ తో వస్తుంది. ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 685 SoC తో పనిచేస్తుంది. అలాగే, ఈ ఫోన్ 6GB RAM మరియు 128GB స్టోరేజ్ తో జత చేయబడింది. ఈ ఫోన్ లేటెస్ట్ MIUI 14 సాఫ్ట్ వేర్ తో ఆండ్రాయిడ్ 13 OS పైన నడుస్తుంది.
ఈ ఫోన్ లో వెనుక ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ వుంది. ఇందులో, 5MP మెయిన్ కెమెరాకి జతగా 8MP అల్ట్రా-వైడ్ కెమెరా మరియు 2MP మ్యాక్రో కెమెరా ఉన్నాయి. అలాగే, సెల్ఫీల కోసం ముందు భాగంలో 13MP సెల్ఫీ కెమెరా ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ Hi-Res ఆడియో సపోర్ట్ కలిగిన స్టీరియో స్పీకర్ ను కూడా కలిగి ఉంది. ఈ ఫోన్ 5000mAh బ్యాటరీని 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో కలిగివుంది.