రేపటి నుండి మొదలవనున్న Redmi 200MP కెమేరా స్మార్ట్ ఫోన్ సేల్.!

రేపటి నుండి మొదలవనున్న Redmi 200MP కెమేరా స్మార్ట్ ఫోన్ సేల్.!
HIGHLIGHTS

Redmi Note 12 Series స్మార్ట్ ఫోన్లు రేపటి నుండి సేల్ కి అందుబాటులోకి రానున్నాయి

ఈ సిరీస్ నుండి Redmi Note 12 5G, 12 Pro 5G మరియు 12 Pro+ 5G లను విడుదల చేసింది

Redmi Note 12 Pro+ 5G స్మార్ట్ ఫోన్ 200MP భారీ కెమేరాతో వచ్చింది

షియోమి ఇండియాలో విడుదల చేసిన లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ సిరీస్ Redmi Note 12 Series స్మార్ట్ ఫోన్లు రేపటి నుండి సేల్ కి అందుబాటులోకి రానున్నాయి. ఈ సిరీస్ నుండి Redmi Note 12 5G, 12 Pro 5G మరియు 12 Pro+ 5G స్మార్ట్ ఫోన్లను విడుదల చేసింది మరియు ఈ మూడు ఫోన్లు కూడా రేపటి నుండి సేల్ అవనున్నాయి. వీటిలో, 12 Pro+ 5G స్మార్ట్ ఫోన్ 200MP భారీ కెమేరా మరియు మరిన్ని ఆకర్షణీయమైన ఫీచర్లతో వచ్చింది. ఈ స్మార్ట్ ఫోన్ ధర, స్పెక్స్ మరియు ఆఫర్లను గురించి వివరంగా చూద్దాం.

Redmi Note 12 Pro+ 5G: ధర 

రెడ్ మి నోట్ 12 ప్రో+ 5G స్మార్ట్ ఫోన్ బేసిక్ వేరియంట్ 8GB ర్యామ్ మరియు 256GB స్టోరేజ్ తో రూ.29,999 రూపాయల ధరతో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ హై ఎండ్ వేరియంట్ 12GB ర్యామ్ మరియు 256GB స్టోరేజ్ తో ధర రూ.32,999 ధరతో వచ్చింది. ఈ ఫోన్ జనవరి 11 నుండి అమెజాన్ మరియు mi స్టోర్ నుండి సేల్ కి అందుబాటులోకి వస్తుంది.

ఆఫర్స్:

ఈ ఫోన్ పైన గొప్ప లాంచ్ ఆఫర్లను కూడా కంపెనీ అందించింది. ఈ ఫోన్ ను ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్, EMI మరియు డెబిట్ కార్డ్ EMI తో కొనేవారికి 3,000 రూపాయల భారీ డిస్కౌంట్ అఫర్ చేస్తోంది.

Redmi Note 12 Pro+ 5G: స్పెక్స్ 

Redmi Note 12 Pro+ 5G ఫోన్ 6.5-ఇంచ్ FHD+ రిజల్యూషన్ కలిగిన AMOLED డిస్ప్లేని కలిగి ఉంది. ఈ డిస్ప్లే Dolby Vision సపోర్ట్, 120Hz రిఫ్రెష్ రేట్‌ మరియు 240Hz టచ్ శాంప్లింగ్ రేట్ తో వస్తుంది. ఈ ఫోన్ లేటెస్ట్ మీడియాటెక్ Dimensity 1080 SoC తో వస్తుంది. అలాగే, ఈ ఫోన్ 12GB RAM మరియు UFS2.2 256GB వరకు స్టోరేజ్ ఎంపికతో జత చేయబడింది. ఈ ఫోన్ MIUI 13 సాఫ్ట్ వేర్ తో ఆండ్రాయిడ్ 12 OS పైన నడుస్తుంది. 

ఈ ఫోన్ లో వెనుక భారీ ట్రిపుల్ రియర్ కెమెరాని అందించింది. ఇందులో, OIS సపోర్ట్ కలిగిన 200MP మెయిన్ కెమెరాకి జతగా 8MP అల్ట్రా-వైడ్ కెమెరా మరియు 2MP మ్యాక్రో కెమెరాలు ఉన్నాయి. అలాగే, సెల్ఫీల కోసం  ముందు భాగంలో 16MP సెల్ఫీ కెమెరా ఉంది. Xiaomi 12 Pro+ 5G ఫోన్ Dolby Atmos సపోర్ట్ కలిగిన స్టీరియో స్పీకర్‌ లను కూడా కలిగి ఉంది. 

ఈ ఫోన్ 4,980mAh బ్యాటరీని భారీ 120W ఫాస్ట్ వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్ తో కలిగివుంది. ఈ ఫోన్ కేవలం 19 నిముషాల్లోనే 0 నుడి 100% ఛార్జ్ అవుతుందని కంపెనీ చెబుతోంది. 

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo