2023 జనవరి నెలలో షియోమి ఇండియాలో విడుదల చేసిన Redmi Note 12 5G స్మార్ట్ ఫోన్ యొక్క హై ఎండ్ (8GB+5GB) ర్యామ్ వేరియంట్ ను కూడా కంపెనీ ఇప్పుడు అందించింది. ఈ స్మార్ట్ ఫోన్ బడ్జెట్ ధరలో Snapdragon 4 Gen 1 SoC తో వచ్చింది. ఈ స్మార్ట్ ఫోన్ లాంచ్ తో పాటుగా దీనిపైన ఆకర్షణీయమైన బ్యాంక్ ఆఫర్లను కూడా షియోమి జత చేసింది. ఈ స్మార్ట్ యొక్క ధర మరియు వివరాలు ఎలా ఉన్నాయో చూద్దామా.
రెడ్ మి నోట్ 12 5G ఇప్పటికే 4GB, 6GB RAM వేరియంట్స్ లో లభిస్తోంది. అయితే, కంపెనీ ఇప్పుడు కొత్తగా 8GB మరియు 128GB స్టోరేజ్ వేరియంట్ ను కూడా లాంచ్ చేసింది. ఈ కొత్త వేరియంట్ ను రూ.21,999 రూపాయల ధరతో ప్రకటించింది. ఈ కొత్త వేరియంట్ పైన ICICI బ్యాంక్ యొక్క రూ.1,500 డిస్కౌంట్ అఫర్ ను కూడా జత చేసింది. ఏప్రిల్ 20వ తేదీ నుండి ఈ స్మార్ట్ ఫోన్ సేల్ స్టార్ట్ అవుతుంది.
https://twitter.com/RedmiIndia/status/1647940472462245888?ref_src=twsrc%5Etfw
Redmi Note 12 5G స్పెక్స్ లో ఎటువంటి మార్పులు లేవు. ఈ స్మార్ట్ ఫోన్ 5G రెడీ ఫోన్ మరియు స్నాప్ డ్రాగన్ 4 Gen 1 ప్రోసెసర్, 120Hz రిఫ్రెష్ రేట్ కలిగిన FHD+ సూపర్ AMOLED డిస్ప్లే, 48MP AI ట్రిపుల్ కెమేరా 33W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన 5000 mAh బిగ్ బ్యాటరీ వంటి ప్రత్యేకతలను కలిగివుంది.
అయితే, కొత్త 8GB వేరియంట్ తో 5GB వర్చువల్ ర్యామ్ ను షియోమి జత చేసింది. అంటే, మరింత వేగవంతంగా ఉండే 8GB+5GB ర్యామ్ ఫీచర్ ఈ ఫోన్ తో యూజర్లకు అందుతుంది.