Redmi Note 11 SE: 64MP క్వాడ్ కెమెరా మరియు sAMOLED డిస్ప్లేతో లాంచ్..!!

Updated on 26-Aug-2022
HIGHLIGHTS

షియోమి తన 11 సిరీస్ లైనప్ కు మరొక స్మార్ట్ ఫోన్ ను జత చేసింది

Redmi Note 11 SE స్మార్ట్ ఫోన్ ఇండియన్ మార్కెట్లో ప్రవేశపెట్టింది

ఈ ఫోన్ పైన ICICI బ్యాంక్ కార్డ్స్ పైన 1000 తగ్గింపు అఫర్ ను కూడా ప్రకటించింది

షియోమి తన 11 సిరీస్ లైనప్ కు మరొక స్మార్ట్ ఫోన్ ను జత చేసింది. అదే Redmi Note 11 SE స్మార్ట్ ఫోన్. ఈ స్మార్ట్ ఫోన్ ను 15 వేల రూపాయల సబ్ కేటగిరిలో 64MP క్వాడ్ కెమెరా మరియు సూపర్ AMOLED డిస్ప్లే వంటి మరిన్ని ఫీచర్లతో షియోమీ ఇండియన్ మార్కెట్లో ప్రవేశపెట్టింది. షియోమీ లేటెస్ట్ గా విడుదల చేసిన ఈ కొత్త బడ్జెట్ స్మార్ట్ ఫోన్ యొక్క ధర, స్పెక్స్ మరియు ఫీచర్లను తెలుసుకోండి.  

Redmi Note 11 SE: ప్రైస్

రెడ్ మి నోట్ 11 SE స్మార్ట్ ఫోన్ 6GB ర్యామ్ మరియు 64GB వేరియంట్ తో లాంచ్ అయ్యింది మరియు దీని ధర రూ.13,999. ఈ ఫోన్ యొక్క మొదటి సేల్ ఆగష్టు 31 వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు Flipkart, Mi.com,Mi Home మరియు Mi Studios నుండి జరుగుతుంది. ఈ ఫోన్ పైన ICICI బ్యాంక్ కార్డ్స్ పైన 1000 తగ్గింపు అఫర్ ను కూడా ప్రకటించింది.      

Redmi Note 11T SE : స్పెక్స్

రెడ్ మి నోట్ 11 SE యొక్క స్పెక్స్ విషయానికి వస్తే, ఇది 6.43 ఇంచ్ FHD+ సూపర్ AMOLED డిస్ప్లేని పంచ్ హోల్ డిజైన్ తో కలిగివుంది. ఈ 1100 నిట్స్ పీక్ బ్రైట్నెస్ తో వస్తుంది వుంది మరియు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ రక్షణతో వస్తుంది. ఈ ఫోన్ వేగవంతమైన మీడియాటెక్ గేమింగ్ ప్రోసెసర్ Helio G95 SoC తో పనిచేస్తుంది. దీనికి జతగా 6GB ర్యామ్ మరియు 64GB స్టోరేజ్ లను అందిస్తుంది.

కెమెరా పరంగా, ఈ ఫోన్ వెనుక క్వాడ్ రియర్ కెమెరాని కలిగివుంది. ఇందులో 64MP మైన్ కెమెరా, 8ఎంపి అల్ట్రా-వైడ్ కెమెరా, 2MP డెప్త్ మరియు 2MP పోర్ట్రైట్ సెన్సార్ లను అందించింది. ఇక సెల్ఫీల కోసం పంచ్ హోల్ లో 13ఎంపి సెల్ఫీ కెమెరాని అందించింది. ఈ ఫోన్ 5,000 mAh బిగ్ బ్యాటరీని  33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో కలిగివుంది.

ఇక ఇతర ఫీచర్ల విషయానికివస్తే, ఇది MIUI 12.5 స్కిన్ పైన ఆండ్రాయిడ్ 11 OS తో నడుస్తుంది. డ్యూయల్ స్టీరియో స్పీకర్లు,Hi-Res ఆడియో సర్టిఫికేషన్ తో కూడా వస్తుంది. సెక్యూరిటీ పరంగా, సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ మరియు ఫేస్ అన్లాక్ ఫీచర్లను కలిగివుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :