Redmi K70 Series Launch: కొత్త ఫోన్స్ లాంచ్ కోసం సిద్దమవుతున్న షియోమి. నవంబర్ 29వ తేదీ కొత్త స్మార్ట్ ఫోన్ లను విడుదల చేస్తునట్లు షియోమి ప్రకటించింది. అయితే, స్మార్ట్ ఫోన్ విడుదల చేయడానికి డేట్ ప్రకటించింది ఇండియన్ మార్కెట్ లో కాదు కాదు చైనీస్ మార్కెట్ లో. ఈ ఫోన్ లను భారీ ఫీచర్స్ మరియు స్పెక్స్ తో తీసుకు వస్తున్నట్లు టీజింగ్ కూడా చేస్తోంది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ సిరీస్ లో మూడు ఫోన్లు ఉన్నాయి మరియు వీటి వివరాలను కూడా వైబో ద్వారా వెల్లడించింది.
రెడ్ మి కె70 సిరీస్ నుండి మూడు ఫోన్లను తీసుకు వస్తున్నట్లు షియోమీ తెలిపింది. ఇందులో K70, K70 Pro మరియు K70E ఉంటాయి. ఈ స్మార్ట్ ఫోన్ లను లేటెస్ట్ ఫాస్ట్ ప్రోసెసర్స్, ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ మరియు శక్తివంతమైన డిస్ప్లేలతో లాంచ్ కాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్లలో మెటల్ ఫ్రెమ్ తో ఉన్నట్లు కూడా రెడ్ మీ టీజర్ చెబుతోంది.
ఈ ఫోన్ ల్లో Redmi K70E స్మార్ట్ ఫోన్ 1.5K రిజల్యూషన్ డిస్ప్లేని 1800 పీక్ బ్రైట్నెస్ తో కలిగి ఉన్నట్లు రెడ్ మీ టీజర్ ద్వారా చూపిస్తోంది. అంతేకాదు, ఈ స్మార్ట్ ఫోన్ లో వున్నా ప్రోసెసర్, బ్యాటరీ మరియు ఛార్జ్ టెక్ వంటి కీలకమైన వివరాలను కూడా టీజర్ ద్వారా చూపించింది. రెడ్ మి కె70 E స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ లేటెస్ట్ ఫాస్ట్ ప్రోసెసర్ Dimensity 8300 Ultra AI తో వస్తుంది.
Also Read : Fire-Boltt Rise Luxe: ప్రీమియం మెటల్ ఎడిషన్ వాచ్ లను లాంచ్ చేస్తున్న ఫైర్ బోల్ట్.!
రెడ్ మి కె70 E స్మార్ట్ ఫోన్ లో 5500 mAh బిగ్ బ్యాటరీ మరియు 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉన్నట్లు కంపెనీ టీజర్ లో వివరించింది. అంతేకాదు, ఈ ఫోన్ లో పెద్ద వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టం ఉన్నట్లు కూడా తెలిపింది.
రెడ్ మి కె70 ప్రో యొక్క కెలకమైన వివరాలను కూడా రెడ్ మి వెల్లడించింది. రెడ్ మి కె70 ప్రో స్మార్ట్ ఫోన్ ను Snapdragon 8 Gen 3 ప్రోసెసర్ తో తీసుకు వస్తున్నట్లు టీజర్ ద్వారా తెలిపింది. ఈ ఫోన్స్ కీలకమైన వివరాలను వెల్లడించింది చైనీస్ మార్కెట్ లో అంచనాలను పెంచినట్లు నివేదికలు చెబుతున్నాయి.