Redmi K60 Ultra: భారీ 24GB ర్యామ్ వంటి సిగ్నేచర్ ఫీచర్లతో లాంచ్ అయ్యింది.!

Redmi K60 Ultra: భారీ 24GB ర్యామ్ వంటి సిగ్నేచర్ ఫీచర్లతో లాంచ్ అయ్యింది.!
HIGHLIGHTS

Redmi యొక్క K సిరీస్ నుండి కొత్త స్మార్ట్ ఫోన్ ను భారీ స్పెక్స్ మరియు ఫీచర్లతో లాంచ్ చేసింది

Redmi K60 Ultra అన్ని విభాగాల్లో కూడా హై ఎండ్ ఫోన్ అవుతుంది

Dolby Vision, HDR 10+ మరియు HDR Vivid సపోర్ట్ తో లాంచ్

Xiaomi సబ్ బ్రాండ్ Redmi యొక్క K సిరీస్ నుండి కొత్త స్మార్ట్ ఫోన్ ను భారీ స్పెక్స్ మరియు ఫీచర్లతో లాంచ్ చేసింది. అదే,Redmi K60 Ultra స్మార్ట్ ఫోన్ మరియు ఇది చైనా మార్కెట్ లో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ స్పెక్స్ మరియు ఫీచర్లు చూస్తే మాత్రం నిజంగా షియోమి  సిగ్నేచర్ ను మార్కెట్ కి పరిచయం చేస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ ను 24GB ర్యామ్ మరియు 1TB హెవీ స్టోరేజ్ వంటి అనేకమైన భారీ ఫీచర్లతో మార్కెట్ కి పరిచయం చేసింది. 

Redmi K60 Ultra: స్పెక్స్ 

రెడ్ మి కె60 అల్ట్రా స్మార్ట్ ఫోన్ అన్ని విభాగాల్లో కూడా హై ఎండ్ ఫోన్ అవుతుంది. ఎందుకంటే, ఈ ఫోన్ డిస్ప్లే మొదలుకొని ఛార్జ్ టెక్ వరకూ అన్ని విభాగాల్లో కూడా భారీగానే వుంది. మరి అవేమిటో వివరంగా చూద్దాం.   

Display:

Redmi K60 Ultra స్మార్ట్ ఫోన్ ను 144Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 1.5 K రిజల్యూషన్ కలిగిన డిస్ప్లేతో లాంచ్ చేసింది. అంటే, ఇది (2712 X 1220) p రిజల్యూషన్ తో క్వాలిటీ విజువల్స్ ను 2600 నిట్స్ పీక్ బ్రైట్నెస్ తో అంధించగలదు. ఇది Dolby Vision, HDR 10+ మరియు HDR Vivid సపోర్ట్ ను కూడా కలిగి వుంది.     

Performence:

ఈ రెడ్ మి స్మార్ట్ ఫోన్ అత్యంత వేగవంతమైన మీడియాటెక్ లేటెస్ట్ ప్రోసెసర్ Dimensity 9200+ SoC శక్తితో పని చేస్తుంది. ఇది 4nm ఫ్యాబ్రికేషన్ మరియు 3.35GHz క్లాక్ స్పీడ్ తో వస్తుంది. ఇది హెవీ గేమింగ్ సమయంలో కూడా ల్యాగ్ ఫ్రీ ఆనందాన్ని అందిస్తుంది. 

RAM & Storage

Redmi K60 Ultra స్మార్ట్ ఫోన్ 24GB (LPDDR5X) ర్యామ్ మరియు 1TB (UFS 4.0) స్టోరేజ్ తో వచ్చింది. అంటే, ఈ ఫోన్ చాలా వేగంగా ఉంటుంది మరియు మీ గేమింగ్ అనుభూతితో పాటుగా ఎంత స్టోరేజ్ చేసిన తరగని హెవీ స్టోరేజ్ ను అందిస్తుంది.

Camera

రెడ్ మి K60 అల్ట్రా స్మార్ట్ ఫోన్ వెనుక ట్రిపుల్ కెమేరా సిస్టం వుంది. ఇందులో 50MP (SonyIMX800) + 8MP అల్ట్రా వైడ్ + 2MP పోర్ట్రైట్ సెన్సార్ లను కలిగి వుంది. సింపుల్ సెటప్ అని కొట్టి పారేయకండి, ఎందుకంటే ఈ కెమేరా సిస్టం (OIS+EIS) సపోర్ట్ తో వస్తుంది మరియు 24fps వద్ద 8K రిజల్యూషన్ తో వీడియో లను చిత్రికరించే సామర్ధ్యంతో వస్తుంది. 

Battery 

ఈ షియోమివ్  స్మార్ట్ ఫోన్ 120W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగిన 5000 mAh బ్యాటరీని కలిగి వుంది. ఈ స్మార్ట్ ఫోన్ IP68 రేటింగ్ తో వాటర్ మరియు డస్ట్ రెసిస్టెంట్ గా వుంటుంది.                     

Redmi K60 Ultra: ధర 

చైనా మార్కెట్ లో విడుదలైన ఈ రెడ్ మి స్మార్ట్ ఫోన్ CNY 2599 ప్రారంభ ధరతో లాంచ్ అయ్యింది మరియు ఇది 12GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ కోసం నిర్ణయించిన ధర. ఇక హై ఎండ్ వేరియంట్ ధర ను చూస్తే, 24GB RAM + 1TB స్టోరేజ్ వేరియంట్ ధర CNY 3599 (సుమారు రూ. 41,500).

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo