Redmi K50i: డాల్బీ విజన్ డిస్ప్లే, 64MP ట్రిపుల్ కెమెరాతో లాంచ్..!!

Updated on 12-Apr-2023
HIGHLIGHTS

ఈరోజు విడుదలైన Redmi K50i 5G

Dolby Vision డిస్ప్లేతో వచ్చింది

ఈ ఫోన్ 67W టర్బో ఛార్జింగ్ సపోర్ట్ కలిగిన 5,080mAh బ్యాటరీని కలిగి ఉంది

షియోమీ యొక్క K సిరీస్ నుండి కొత్త ఫోన్ ను ఈరోజు ఇండియాలో విడుదల చేసింది. Redmi K50i 5G పేరుతో ఈ స్మార్ట్ ఫోన్ ను ఇండియన్ మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఈ ఫోన్ అల్రౌండ్ ఫీచర్లతో ఆకట్టుకునే ధరలో వచ్చింది. ఈ స్మార్ట్ ఫోన్ Dolby Vision డిస్ప్లే మరియు Dolby Atmos సౌండ్ టెక్నాలజీని కూడా కలిగి వుంది. అంతేకాదు, మంచి కెమెరా సెటప్ తో పాటుగా వేగవంతమైన ఛార్జింగ్ సపోర్ట్ కలిగిన పెద్ద బ్యాటరీని కూడా ఈ ఈ ఫోన్ లో వుంది. మరి ఈ సరికొత్త షియోమీ స్మార్ట్ ఫోన్ ధర, స్పెక్స్ మరియు ఫీచర్లు ఎలా ఉన్నాయో ఒక లుక్ వేద్దామా. 

Redmi K50i 5G: ధర

రెడ్ మి కె 50i స్మార్ట్ ఫోన్ యొక్క 6GB ర్యామ్/128GB స్టోరేజ్ కలిగిన బేసిక్ మోడల్ ధర రూ.25,999. అలాగే, 8GB ర్యామ్/256GB స్టోరేజ్ కలిగిన హై ఎండ్ మోడల్ ధర రూ.28,999. ఈ స్మార్ట్ ఫోన్ అమెజాన్ ప్రైమ్ డే సేల్ నుండి, అంటే 23 నుండి అమెజాన్ మరియు mi.com నుండి సేల్ కి అందుబాటులోకి వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ ను ICICI బ్యాంక్ కార్డ్స్ తో కొనేవారికి 3,000 రూపాయల అదనపు డిస్కౌంట్ అఫర్ ను కూడా షియోమీ ఈ ఫోన్ తో ప్రకటించింది.

Redmi K50i 5G: స్పెక్స్

రెడ్ మి కె 50i స్మార్ట్ ఫోన్ 6.6 ఇంచ్ FHD+ రిజల్యూషన్ కలిగిన లిక్విడ్ FFS డిస్ప్లేని కలిగివుంది. ఇది 144Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. ఇది HDR 10 మరియు Dolby Vision లకు సపోర్ట్ చేస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ 5nm ప్రాసెసర్ Dimensity 8100 ఆక్టా కోర్ ప్రోసెసర్ శక్తితో పనిచేస్తుంది. దీనికి జతగా LPDDR5 8GB ర్యామ్ మరియు UFS 3.1 128GB ఇంటర్నల్ స్టోరేజ్ కూడా ఉన్నాయి. ఈ ఫోన్ ను అన్ని సమయాల్లో చల్లబరిచేందుకు లిక్విడ్ కూల్ 2.0 ఫీచర్ ను కూడా అందించింది. 

ఆప్టిక్స్ పరంగా, K50i 5G ఫోన్ వెనుక ట్రిపుల్ కెమెరా సెటప్ వుంది. ఇందులో, 64MP ప్రధాన కెమెరాకి జతగా 8MP అల్ట్రా-వైడ్ కెమెరా మరియు మ్యాక్రో కెమెరా   వున్నాయి. ఇక సెల్ఫీల కోసం ముందు భాగంలో 16MP సెల్ఫీ కెమెరాని అందించింది. ఈ ఫోన్ 67W టర్బో ఛార్జింగ్ సపోర్ట్ కలిగిన 5,080mAh బ్యాటరీని కలిగి ఉంది. ఆడియో పరంగా, ఈ ఫోన్ లో Dolby Atmos మరియు Hi-Res సపోర్ట్ కలిగిన డ్యూయల్ స్టీరియో స్పీకర్లను కలిగివుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఆధారితమైన MIUI 13 సాఫ్ట్ వేర్ పైన నడుస్తుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :