భారీ డిస్కౌంట్ తో Redmi K50i సేల్..!!

భారీ డిస్కౌంట్ తో Redmi K50i సేల్..!!
HIGHLIGHTS

Redmi K50i 5G అమెజాన్ నుండి భారీ డిస్కౌంట్ ఆఫర్ తో సేల్ అవుతోంది

అమెజాన్ నుండి 4,000 రూపాయల వరకూ తగ్గింపును పొందేవీలుంది

ఈ స్మార్ట్ ఫోన్ ను అఫర్ లతో మరింత తక్కువ ధరకే పొందవచ్చు

షియోమీ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ Redmi K50i 5G అమెజాన్ నుండి భారీ డిస్కౌంట్ ఆఫర్ తో సేల్ అవుతోంది. ఇటీవల ఇండియాలో విడుదలైన ఈ స్మార్ట్ ఫోన్ పైన ఇప్పుడు అమెజాన్ నుండి 4,000 రూపాయల వరకూ తగ్గింపును పొందేవీలుంది. మిడ్ రేంజ్ ధరలో వచ్చిన ఈ స్మార్ట్ ఫోన్ ను అఫర్ లతో మరింత తక్కువ ధరకే పొందవచ్చు. అమెజాన్ ఈ రెడ్ మీ కె50i స్మార్ట్ ఫోన్ పైన అందించిన ఏఈ అఫర్ వివరాలు ఏమిటో చూద్దమా.        

Redmi K50i 5G: ధర మరియు ఆఫర్లు

రెడ్ మి కె 50i స్మార్ట్ ఫోన్ యొక్క 6GB ర్యామ్/128GB స్టోరేజ్ కలిగిన బేసిక్ మోడల్ ధర రూ.25,999. అలాగే, 8GB ర్యామ్/256GB స్టోరేజ్ కలిగిన హై ఎండ్ మోడల్ ధర రూ.28,999. అయితే, ప్రస్తుతం ఈ స్మార్ట్ ఫోన్ 1,500 రూపాయల కూపన్ అఫర్ మరియు 2,500 రూపాయల బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్లతో లభిస్తోంది.  ఈ స్మార్ట్ ఫోన్ అమెజాన్ నుండిICICI,  బ్యాంక్ కార్డ్స్ తో కొనేవారికి 3,000 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. Buy From Here

Redmi K50i 5G: స్పెక్స్

Redmi K50i (3).jpg

రెడ్ మి కె 50i స్మార్ట్ ఫోన్ 6.6 ఇంచ్ FHD+ రిజల్యూషన్ కలిగిన లిక్విడ్ FFS డిస్ప్లేని కలిగివుంది. ఇది 144Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. ఇది HDR 10 మరియు Dolby Vision లకు సపోర్ట్ చేస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ 5nm ప్రాసెసర్ Dimensity 8100 ఆక్టా కోర్ ప్రోసెసర్ శక్తితో పనిచేస్తుంది. దీనికి జతగా LPDDR5 8GB ర్యామ్ మరియు UFS 3.1 128GB ఇంటర్నల్ స్టోరేజ్ కూడా ఉన్నాయి. ఈ ఫోన్ ను అన్ని సమయాల్లో చల్లబరిచేందుకు లిక్విడ్ కూల్ 2.0 ఫీచర్ ను కూడా అందించింది.

ఆప్టిక్స్ పరంగా, K50i 5G ఫోన్ వెనుక ట్రిపుల్ కెమెరా సెటప్ వుంది. ఇందులో, 64MP ప్రధాన కెమెరాకి జతగా 8MP అల్ట్రా-వైడ్ కెమెరా మరియు మ్యాక్రో కెమెరా   వున్నాయి. ఇక సెల్ఫీల కోసం ముందు భాగంలో 16MP సెల్ఫీ కెమెరాని అందించింది. ఈ ఫోన్ 67W టర్బో ఛార్జింగ్ సపోర్ట్ కలిగిన 5,080mAh బ్యాటరీని కలిగి ఉంది. ఆడియో పరంగా, ఈ ఫోన్ లో Dolby Atmos మరియు Hi-Res సపోర్ట్ కలిగిన డ్యూయల్ స్టీరియో స్పీకర్లను కలిగివుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఆధారితమైన MIUI 13 సాఫ్ట్ వేర్ పైన నడుస్తుంది. 

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo