స్నాప్ డ్రాగన్ 855 తో ఒక స్మార్ట్ ఫోన్ అందించే ఆలోచనలో రెడ్మి : రిపోర్ట్

Updated on 11-Feb-2019
HIGHLIGHTS

ఇది దాని మొదటి సంవత్సరంలోనే ఫ్లాగ్ షిప్ చిప్సెట్ ఫోన్ల పైన ద్రుష్టి పెడుతున్నట్లు తెలుస్తోంది.

Redmi ఒక స్వతంత్ర బ్రాండ్ గా అవతరించిన తరువాత, ఇది దాని మొదటి సంవత్సరంలోనే ఫ్లాగ్ షిప్ చిప్సెట్ ఫోన్లా పైన ద్రుష్టి పెడుతున్నట్లు తెలుస్తోంది. షావోమి యొక్క ఉప బ్రాండ్ అయిన Poco గత సంవత్సరం ఒక ప్రధాన స్నాప్డ్రాగెన్ 845-శక్తితో ఒక స్మార్ట్ ఫోన్ను ప్రారంభించింది. అలాగే, దాని సరికొత్త అనుబంధ సంస్థ అయిన, Redmi కూడా ఈ సంవత్సరంలో ఒక ప్రధాన స్నాప్ డ్రాగన్ 855 ప్రాసెసెరుతో నడిచే, ఒక స్మార్ట్ ఫోన్ను ప్రారంభించటానికి ప్రణాళికలను సిద్ధం చేసుకున్నట్లు ప్రస్తుతం వస్తున్నా నివేదికల ద్వారా తెలుస్తోంది.

రెడ్మి యొక్క జనరల్ మేనేజర్ అయిన, లూ వైబింగ్ చేత Weibo (వయా GSMArena) లో పోస్ట్ చేయబడిన  ఒక పోస్ట్ ప్రకారం, మిడ్-రేంజ్ జోన్ నుండి బయటకు రావడానికి మరియు స్నాప్ డ్రాగన్ 855 చిప్సెట్ తో పనిచేసే స్మార్ట్ ఫోన్లతో, ఫ్లాగ్షిప్ స్మార్ట్ ఫోన్ల విభాగంలోకి  ప్రవేశించడానికి కంపెనీ అంచనాలను సిద్ధం చేసుకుంటోంది. షావోమి యొక్క షెన్జెన్ R & D ఇన్స్టిట్యూట్లో జరిగిన చర్చలోని  కొన్ని వివరాలను, వెయిబింగ్ తన ఇమేజితో పాటుగా రెడ్మి సిబ్బందితో ఒక ఇమేజితో ఒక పోస్ట్ను వెల్లడించాడు. కానీ,  ఈ ప్రధాన రెడ్మి ఫోన్ గురించి మరే ఇతర వివరాలను ఈ పోస్ట్ లో తెలియచేయలేదు.

భారతదేశంలో, రెడ్మి  దాని కొత్త స్మార్ట్ ఫోన్లను ప్రారంభించటానికి కొన్ని రోజుల సమయం ఉంది అనిపిస్తోంది.  ఎందుకంటే, రెడ్మి ఈ రెడ్మి నోట్ 7 గురించి చేస్తున్న కొన్ని టీజింగ్స్ ఇందుకు కారణం అని చెప్పొచ్చు. ఆలాగే, రెడ్మి నోట్ 7 ఫోన్ను ఇండియాలో 48MP కెమెరా సెటప్పుతో, అత్యంత సరసమైన స్మార్ట్ ఫోనుగా  విడుదలచేయనున్నట్లు భావిస్తున్నారు.  రెడ్మీ భారతదేశంలో నోట్ 7 విడుదల సమయం గురించి చూస్తే , అది శామ్సంగ్ కొత్తగా విడుదల చేసిన గెలాక్సీ M సిరీస్ స్మార్ట్ ఫోన్ల పైన ఎక్కువ ప్రభావాన్ని చూపేలా అనిపిస్తోంది.  కానీ, షావోమి మరియు రెడ్మి, వీటి గురించిన టీజింగులను మాత్రమే చేస్తున్నాయి తప్ప,  భారతదేశంలో రెడ్మి నోట్ 7 లాంచ్ గురించి ఎటువంటి తేదీ అప్డేట్ మాత్రం అందిచడంలేదు. ఈ రెడ్మి నోట్ 7 తో పాటుగా రెడ్మి నోట్ 7 ప్రో  ని కూడా భారతదేశంలో విడుదల చేయవచ్చని నివేదికలు అంచనావేసి చెబుతున్నాయి.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :