Redmi Go స్మార్ట్ ఫోన్ స్పెక్స్ షీట్ లీక్

Redmi Go స్మార్ట్ ఫోన్ స్పెక్స్ షీట్ లీక్
HIGHLIGHTS

లీకైన ఈ స్పెక్స్ షీట్ ద్వారా, స్నాప్ డ్రాగన్ 425 SoC, 5-అంగుళాల డిస్ప్లే తో రానున్నట్లు చెబుతోంది.

ఇటీవల, షావోమి దాని రెడ్మి నోట్ 7  ఫోన్ను చైనా లో విడుదలచేసింది మరియు త్వరలోనే ఈ హ్యాండ్సెట్ ని భారతదేశంలో అనౌన్స్ చేయవచ్చని భావిస్తున్నారు. అయితే,  రెడ్మి నోట్ 7 తో పాటుగా ఈ కంపెనీ రెడ్మి నోట్ 7 ప్రో మరియు  Redmi Go అని పిలిచే  ఒక Android Go- Powered ఫోన్ కూడా అనౌన్స్ చేయవచ్చని, వస్తున్న పుకార్లు తెలుపుతున్నాయి.

ఇప్పుడు,  ఫిలిప్పీన్స్ లో షావోమి ఒక కొత్త ఫోన్ యొక్క లాంచ్ టీజింగ్ చేస్తోంది. అయితే, ఇది Redmi Go  కావచ్చని ఊహిస్తున్నారు.  ఫిలిప్పీన్స్ లో ఉన్నటువంటి  ఒక e-కామర్స్ సంస్థ అయినటువంటి, Revu లో రెడ్మి గో వంటి ఫోన్ యొక్క పూర్తి స్పెక్స్ ఉన్న ఒక హ్యాండ్ సెట్ను కలిగి ఉంది. ఈ ఆన్లైన్ అమ్మకదారుడు, ఇప్పుడు పేజీని  తీసేసినప్పటికీ , ఇ-కామర్స్ ప్లాట్ఫారమ్లో ఇదే విధమైన స్పెక్స్ వివరిస్తున్న ఒక ఫోన్ యొక్క స్పెసిఫికేషన్ షీటును Slashleaks కూడా పోస్ట్ చేసింది.

బయటికి ఇచ్చిన ఫోన్ యొక్క రెండర్ మరియు స్పెక్స్ విషయానికి వస్తే, ఈ Redmi Go డిజైన్ పరంగా రెడ్మి 5A కు చాలా దగ్గరి పోలికను  కలిగివుంటుంది. ఈ ఫోన్  16: 9 యాస్పెక్ట్ రేషియో డిస్ప్లేలో, ఎగువ మరియు దిగువ భాగంలో మందపాటి బిజెల్స్ చూడవచ్చు మరియు ఈ డివైజ్ యొక్క వెనుకవైపు ఉన్న ఒక ఎడమ మూలలో సింగల్ కెమెరా మరియు ఫ్లాష్ మాడ్యూల్ ఉన్నాయి. యాంటెన్నా లైన్స్ మరియు స్పీకర్ గ్రిల్ మాత్రం వెనుక లేవు.

Redmi Go specs intext.jpg

హార్డ్వేర్ పరంగా, రెడ్మి గో 1280x720p రిజల్యూషనుతో,  ఒక 5-అంగుళాల LCD HD డిస్ప్లేని కలిగి ఉంటుంది, ఇది క్వాల్కమ్ యొక్క స్నాప్ డ్రాగన్ 425 SoC తో నడుస్తుంది. ఒక మైక్రో SD కార్డు ద్వారా 128GB వరకు పెంచుకునేలా,  8 GB ఇంటర్నల్ స్టోరేజితో పాటుగా 1 జీబి ర్యామ్ తో జతగా ఈ హ్యాండ్ సెట్ లభిస్తుంది.

ఆప్టిక్స్ పరంగా, ఈ స్మార్ట్ ఫోన్ ఒక 8MP ఒకే వెనుక కెమెరాతో f / 2.0 ఎపర్చరు మరియు 1.12μm పిక్సెల్ పరిమాణంతో వస్తుంది. ముందు, ఇది ఒక 5MP సెన్సారుని కలిగివుంది.  ఇది 1.12μm పిక్సెల్ పరిమాణం మరియు ఒక f / 2/2 ఎపర్చరుతో ఉంటుంది. ఇది ఆండ్రాయిడ్ 8.1 ఓరియో (గో ఎడిషన్) ద్వారా నడుపుతున్న ఈ హ్యాండ్సెట్, ఒక 3000 mAh బ్యాటరీ, మైక్రోUSB ఛార్జింగ్ పోర్టులతో వస్తుంది. ఈ స్పెక్ షీట్ ప్రకారం, ఈ ఫోన్ బ్లాక్ మరియు బ్లూ కలర్ రకాలు మరియు డ్యూయల్ సిమ్ మద్దత్తుతో వస్తాయని సూచిస్తుంది

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo