Redmi A4 5G ఫోన్ ను Snapdragon 4 Gen 2 తో అనౌన్స్ చేసిన షియోమీ.!

Updated on 16-Oct-2024
HIGHLIGHTS

IMC 2024 నుంచి ఈరోజు షియోమీ కొత్త ఫోన్ ను అనౌన్స్ చేసింది

edmi A4 5G స్మార్ట్ ఫోన్ ను Snapdragon 4 Gen 2 చిప్ సెట్ తో అనౌన్స్ చేసింది

ఈ ఫోన్ ను 10 వేల ఉప బడ్జెట్ లాంచ్ చేసే అవకాశం

IMC 2024 నుంచి ఈరోజు షియోమీ కొత్త ఫోన్ ను అనౌన్స్ చేసింది. అదే Redmi A4 5G స్మార్ట్ ఫోన్ మరియు ఈ ఫోన్ ను Snapdragon 4 Gen 2 చిప్ సెట్ తో అనౌన్స్ చేసింది. రెడ్ మీ A సిరీస్ బడ్జెట్ ఫోన్ సిరీస్ గా పేరొందింది. అందుకే, ఈ సిరీస్ మరియు ఈ ఫోన్ స్పెక్స్ ను దృష్టిలో పెట్టుకొని ఈ ఫోన్ ను 10 వేల ఉప బడ్జెట్ లాంచ్ చేసే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు.

Redmi A4 5G : ఫీచర్స్

రెడ్ మీ ఎ4 5జి స్మార్ట్ ఫోన్ ను ఇండియా మొబైల్ కాంగ్రెస్ (IMC 2024) నుంచి ఈ ఫోన్ ను షియోమీ అనౌన్స్ చేసింది. స్నాప్ డ్రాగన్ 4 జెన్ 2 తో ఇండియన్ మార్కెట్ లో అడుగుపెట్టిన మొదటి ఫోన్ గా ఇప్పుడు రెడ్ మీ ఎ4 5జి నిలుస్తుంది. ప్రస్తుతం మార్కెట్ లో నడుస్తున్న ట్రెండ్ మరియు ఈ ఫోన్ స్పెక్స్ ను అనుసరించి ఈ ఫోన్ ను 10,000 రూపాయల ఉప బడ్జెట్ లో అందించే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు.

భారతదేశంలో పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చిన 5G నెట్ వర్క్ తో బడ్జెట్ 5G ఫోన్ మార్కెట్ మరింత పుంజుకుంది. అందుకే, ఈ 10 వేల రూపాయల బడ్జెట్ పరిధిలో ఈ ఫోన్ ను అందిస్తుందని కూడా చెబుతున్నారు. ఈ ఫోన్ ఆవిష్కరణ సమయంలో షియోమి ఇండియా ప్రెసిడెంట్ అయిన మురళీకృష్ణన్ బి, “ ప్రతి భారతీయునికి అడ్వాన్స్ టెక్నాలజీ అందించడానికి మేము చేస్తున్న కృషి లో రెడ్ మీ ఎ4 5జి స్మార్ట్ ఫోన్ కీలకపాత్ర పోషిస్తోంది” అని తెలిపారు.

Also Read: భారీ డిస్కౌంట్ తో 5 వేలకే Dolby Soundbar అందుకోండి.!

ఈ ఫోన్ యొక్క ఇతర స్పెక్స్ లేదా ఫీచర్స్ ను వెల్లడించలేదు. అయితే, ఈ ఫోన్ ఇమేజ్ ద్వారా ఈ ఫోన్ లో పెద్ద రౌండ్ బంప్ కనిపిస్తోంది. ఈ బంప్ లో డ్యూయల్ రియర్ కెమెరా వుండే అవకాశం ఉంటుంది మరియు ఈ ఫోన్ చాలా స్లీక్ గా కనిపిస్తోంది. ఈ ఫోన్ అతి త్వరలోనే మార్కెట్ లో విడుదల అయ్యే అవకాశం వుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :