Redmi A4 5G ని కేవలం రూ. 8,499 ధరకే లాంచ్ చేసింది.. ఫీచర్స్ మాత్రం అదుర్స్.!

Redmi A4 5G ని కేవలం రూ. 8,499 ధరకే లాంచ్ చేసింది.. ఫీచర్స్ మాత్రం అదుర్స్.!
HIGHLIGHTS

Redmi A4 5G స్మార్ట్ ఫోన్ ను షియోమి విడుదల చేసింది

ఆకర్షణీయమైన డిజైన్ మరియు ఫీచర్లతో బడ్జెట్ యూజర్ ను లక్ష్యంగా చేసుకొని విడుదల చేసింది

రెడ్ మీ A4 5జి స్మార్ట్ ఫోన్ ను రెండు వేరియంట్లలో విడుదల చేసింది

Redmi A4 5G స్మార్ట్ ఫోన్ ను షియోమి విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ ను ఆకర్షణీయమైన డిజైన్ మరియు ఫీచర్లతో బడ్జెట్ యూజర్ ను లక్ష్యంగా చేసుకొని విడుదల చేసింది. ఈ షియోమి కొత్త ఫోన్ 10 వేల రూపాయల ఉప బడ్జెట్ లో ప్రస్తుతం మార్కెట్లో కొనసాగుతున్న చాలా ఫోన్ లకు గట్టి పోటీ గా నిలబడడానికి తగిన అన్ని ఫీచర్స్ ను కలిగి ఉంది మరియు చాలా అగ్రెసివ్ ప్రైస్ తో లాంచ్ అయ్యింది.

Redmi A4 5G : ధర

రెడ్ మీ A4 5జి స్మార్ట్ ఫోన్ ను రెండు వేరియంట్లలో విడుదల చేసింది. ఈ ఫోన్ బేసిక్ వేరియంట్ (4GB + 64GB) ను కేవలం రూ. 8,499 ధరతో ప్రకటించింది. ఈ ఫోన్ యొక్క రెండవ (4GB + 128GB) వేరియంట్ ను రూ. 8,999 ధరతో లాంచ్ చేసింది. బడ్జెట్ యూజర్ ను లక్ష్యంగా చేసుకొని లాంచ్ చేసిన తెచ్చిన ఈ ఫోన్ నవంబర్ 27వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి సేల్ కి అందుబాటులోకి వస్తుంది.

రెడ్ మీ A4 5జి స్మార్ట్ ఫోన్ స్టార్రి బ్లాక్ మరియు స్పార్కల్ పర్పల్ అనే రెండు కలర్ ఆప్షన్ లలో లభిస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ mi.com మరియు అమెజాన్ ద్వారా సేల్ అవుతుంది.

Also Read: Dolby Audio సపోర్ట్ తో వచ్చే బెస్ట్ బడ్జెట్ 5.1 ఛానల్ Soundbar కోసం చూస్తున్నారా.!

Redmi A4 5G : ఫీచర్స్

రెడ్ మీ ఎ4 5జి స్మార్ట్ ఫోన్ పెద్ద 6.88 ఇంచ్ స్క్రీన్ తో వచ్చింది మరియు ఈ స్క్రీన్ HD+ రిజల్యూషన్ ను కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్ మరియు 600 నిట్స్ పీక్ బ్రైట్నెస్ సపోర్ట్ తో ఉంటుంది. ఈ ఫోన్ ను Snapdragon 4s Gen 2 చిప్ సెట్ తో లాంచ్ చేసింది. ఈ చిప్ సెట్ తో ప్రపంచంలో మొదటిగా విడుదలైన స్మార్ట్ ఫోన్ గా ఈ ఫోన్ నిలిచింది. అలాగే, 4GB ర్యామ్ మరియు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ ను ఈ ఫోన్ కలిగి ఉంటుంది.

Redmi A4 5G

ఈ ఫోన్ లో వెనుక 50MP AI డ్యూయల్ రియర్ కెమెరా మరియు ముందు 5MP సెల్ఫీ కెమెరా కూడా వుంది. ఈ ఫోన్ తో 1080 వీడియోస్ ను 30fps వద్ద షూట్ చేయవచ్చు. ఈ ఫోన్ లో సింగల్ స్పీకర్ ఉంటుంది మరియు సింగల్ మైక్ ఉంటుంది. రెడ్ మీ ఎ4 5జి స్మార్ట్ ఫోన్ ను 5000 mAh బిగ్ బ్యాటరీ మరియు 18W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ తో లాంచ్ చేసింది. అయితే, ఈ ఫోన్ బాక్స్ లో మాత్రం 33W ఫాస్ట్ ఛార్జర్ ను అందిస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo