Redmi A3 First Sale: రెడ్ మి బడ్జెట్ స్టైలిష్ ఫోన్ ఫస్ట్ సేల్.!

Updated on 22-Feb-2024
HIGHLIGHTS

రెడ్ మి ఎ3 స్మార్ట్ ఫోన్ మొదటి సారిగా సేల్ కి అందుబాటులోకి రానున్నది

ఈ స్మార్ట్ ఫోన్ రేపు మధ్యాహ్నం 12 గంటల నుండి సేల్ కి అందుబాటులోకి వస్తుంది

ఈ ఫోన్ ను 7 వేల రూపాయల బడ్జెట్ ధరలో ప్రీమియం డిజైన్ తో తీసుకు వచ్చింది

Redmi A3 First Sale: షియోమి గత వారంలో ఇండియన్ మార్కెట్ లో విడుదల చేసిన రెడ్ మి ఎ3 స్మార్ట్ ఫోన్ మొదటి సారిగా సేల్ కి అందుబాటులోకి రానున్నది. ఈ స్మార్ట్ ఫోన్ రేపు మధ్యాహ్నం 12 గంటల నుండి సేల్ కి అందుబాటులోకి వస్తుంది. ఈ ఫోన్ ను 7 వేల రూపాయల బడ్జెట్ ధరలో ప్రీమియం హేలో డిజైన్ మరియు మరిన్ని ఫీచర్స్ తో తీసుకు వచ్చింది షియోమి.

Redmi A3 First Sale

రెడ్ మి ఎ3 స్మార్ట్ ఫోన్ ను రూ. 7,299 రూపాయల ప్రారంభ ధరతో లాంఛ్ చేసింది. ఈ ఫోన్ యొక్క 3 GB RAM + 64 GB ROM వేరియంట్ ఈ ధరకు లభిస్తుంది. ఈ ఫోన్ యొక్క 4 GB RAM + 128 GB ROM వేరియంట్ కోసం రూ. 8,299 మరియు ఈ ఫోన్ యొక్క 6 GB RAM + 128 GB ROM హై ఎండ్ వేరియంట్ కోసం రూ. 9,299 రూపాయలు ఖర్చు చేయవలసి వస్తుంది.

ఈ ఫోన్ యొక్క మొదటి సేల్, ఫిబ్రవరి 23వ తేదీ మద్యహ్నం 12 గంటల నుండి మొదలవుతుంది. ఈ స్మార్ట్ ఫోన్ Flipkart మరియు mi.com నుండి సేల్ కి అందుబాటులో ఉంటుంది.

Also Read: OnePlus Watch 2: మిలటరీ గ్రేడ్ మన్నికతో కొత్త రగ్డ్ స్మార్ట్ వాచ్ లాంఛ్ చేస్తున్న వన్ ప్లస్.!

రెడ్ మి ఎ3 ప్రత్యేకతలు

రెడ్ మి ఎ3 స్మార్ట్ ఫోన్ కొత్త ప్రీమియం హేలో డిజైన్ తో వచ్చింది. ఈ ఫోన్ లో 90Hz రిఫ్రెష్ రేట్ మరియు HD+ రిజల్యూషన్ కలిగిన 6.71 ఇంచ్ డిస్ప్లేని Gorilla Glass 3 ప్రొటెక్షన్ తో కలిగి వుంది. ఈ ఫోన్ లో Mediatek Helio G36 ప్రోసెసర్ మరియు 6GB RAM సపోర్ట్ వుంది. ఈ ఫోన్ ను 128 GB వరకూ ఇంటర్నల్ స్టోరేజ్ తో పాటు 1 TB ఎక్స్ ప్యాండబుల్ స్టోరేజ్ ఆప్షన్ తో కూడా వస్తుంది.

రెడ్ మి ఎ3 లో వెనుక 8MP డ్యూయల్ రియర్ కేమెరా సేతువు మరియు ముందు 5MP సెల్ఫీ కెమేరా సెటప్ ఉన్నాయి. ఈ ఫోన్ లో సెక్యూరిటీ పరంగా సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా వుంది. అలాగే, ఫోన్ ను ఎక్కువ కాలం నడిపించ గల 5000 mAh బిగ్ బ్యాటరీ ను కూడా ఈ ఫోన్ లో అందించింది రెడ్ మి.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :