Redmi A3: ఇండియన్ మార్కెట్ లో కొత్త ప్రీమియం డిజైన్ తో సరికొత్త స్మార్ట్ ఫోన్ ను లాంఛ్ చేయడానికి సిద్దమయ్యింది. ఈ అప్ కమింగ్ ఫోన్ డిజైన్ ను వివరించేలా ఈ ఫోన్ టీజర్ ఇమేజ్ లను అందించింది. రెడ్ మి ఎ3 ఫోన్ యొక్క కీలకమైన స్పెక్ ను కూడా టీజర్ పేజ్ ద్వారా ఒక్కికటిగా బయట పెట్టడం మొదలు పెట్టింది. ఈ అప్ కమింగ్ రెడ్ మి ఫోన్ ఎలాంటి ఫీచర్స్ తో రాబోతోంది అని తెలుసుకుందామా.
రెడ్ మి ఎ3 స్మార్ట్ ఫోన్ ను కొత్త Premium Halo Design తో తీసుకు వస్తున్నట్లు షియోమి చెబుతోంది. ఈ ఫోన్ లెథర్ టెక్స్చర్ తో ప్రీమియం గ్రీన్ కలర్ లో చాలా అందంగా కనిపిస్తోంది. ఈ ఫోన్ లో వెనుక గుండ్రని కెమేరా బంప్ తో విలక్షణంగా మరియు కొత్తగా కనిపిస్తోంది. ఈ ఫోన్ లో వెనుక డ్యూయల్ కెమేరా సెటప్ ఫ్లాష్ జతగా వుంది. అయితే, ఈ కెమేరా సెటప్ లో ఉన్న కెమేరా సెటప్ వివరాలు ఇంకా వెల్లడించ లేదు.
Also Read: మీకు నచ్చిన వారిని Best Valentines day Gift తో సర్ప్రైజ్ చెయ్యాలనుకుంటున్నారా.!
రెడ్ మి ఎ3 ఫోన్ ను 90Hz రిఫ్రెష్ రేట్ కలిగిన డిస్ప్లేతో లాంచ్ చేయనున్నట్లు టీజర్ ద్వారా కన్ఫర్మ్ చేసింది. ఈ ఫోన్ లో అందించనున్న బ్యాటరీ, పోర్ట్ మరియు RAM వివరాలను కూడా కంపెనీ ముందే తెలియచేసింది. రెడ్ మి ఎ3 స్మార్ట్ ఫోన్ ను 6GB RAM మరియు 6GB Virtual RAM ఫీచర్ తో తీసుకు వస్తున్నట్లు టీజర్ పేజ్ ద్వారా టీజింగ్ చేస్తోంది.
ఈ ఫోన్ లో 5000 mAh బ్యాటరీ Type C ఛార్జర్ సపోర్ట్ తో ఉన్నట్లు కూడా షియోమి క్లియర్ చేసింది. ఈ ఫోన్ డిజైన్ పరంగా కొత్తగా మరియు ఆకర్షణీయంగా కనిపిస్తోంది. ప్రస్తుతానికి ఈ ఫోన్ కు సంబంధించి ఈ వివరాలను మాత్రమే కంపెనీ టీజర్ ద్వారా బయట పెట్టింది. ఈ ఫోన్ ను ఫిబ్రవరి 14వ తేదీ ఇండియాలో లాంఛ్ చేస్తోంది కాబట్టి ఈలోపుగా మరిన్ని వివరాలను వెళ్ళడించే అవకాశం వుంది.