Redmi A1 ఈరోజు ఇండియా లాంచ్ అయ్యింది. షియోమీ ఈ స్మార్ట్ ఫోన్ కేవలం రూ.6,499 ధరలో అందించినా కూడా ఇందులో భారీ ఫీచర్లనే అందించింది. ఈ ఫోన్ పెద్ద డిస్ప్లే, పెద్ద బ్యాటరీ మరియు AI డ్యూయల్ కెమెరా వంటి మరిన్ని ఆకర్షణీయమైన ఫీచర్లతో వచ్చింది. ఈ ఫోన్ ప్రీమియం లెథర్ తో కనిపించేలా లెదర్ ఫినిషింగ్ కనిపించేలా గొప్ప డిజైన్ తో వచ్చింది. షియోమీ ఇండియాలో లేటెస్ట్ గా తీసుకొచ్చిన ఈ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ యొక్క ధర, స్పెక్స్ మరియు ఫీచర్లను గురించి వివరంగా చూద్దామా.
షియోమి రెడ్‌మి ఎ1 స్మార్ట్ ఫోన్ కేవలం 2 జిబి + 32 జిబి స్టోరేజ్ కలిగిన సింగిల్ వేరియంట్ తో వస్తుంది మరియు దీని ధర ధర రూ .6,499. ఈ స్మార్ట్ ఫోన్ అమెజాన్ మరియు mi స్టోర్ నుండి సెప్టెంబర్ 7 నుండి సేల్ కి అంధుబాటులోకి వస్తుంది.
షియోమి రెడ్‌మి ఎ1 పెద్ద 6.52-అంగుళాల HD + (1600 x 720 పిక్సెల్స్) రిజల్యూషన్ గల IPS LCD డిస్ప్లేని కలిగి ఉంది. ఈ ఫోన్ యొక్క స్క్రీన్ మీకు అత్యధికంగా 400 నిట్స్ గరిష్ట బ్రైట్నెస్ మరియు 20: 9 ఎస్పెక్ట్ రేషియోని ఇస్తుంది. ఇది 9 మిల్లీమీటర్ల మందం మరియు 192 గ్రాముల బరువు కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లైట్ గ్రీన్, లైట్ బ్లూ మరియు బ్లాక్ వంటి మూడు రంగులలో లభిస్తుంది.
Redmi A1 మీడియా టెక్ హెలియో జి 22 ప్రాసెసర్ కి జతగా 2 జిబి ర్యామ్ మరియు 32 జిబి స్టోరేజ్ తో వస్తుంది. అదనంగా, మైక్రో SD కార్డ్ ద్వారా 512GB వరకు మెమరీ విస్తరణకు మద్దతు ఇస్తుంది. ఇది MIUI 12.5 సాఫ్ట్ వేర్ తో ఆండ్రాయిడ్ 11 OS పైన నడుస్తుంది.
రెడ్‌మి ఎ1 లో వెనుక డ్యూయల్ కెమెరా సెటప్ వుంది మరియు అందులో 8ఎంపి ప్రధాన కెమెరాని అందించింది. ముందు నాచ్ కటౌట్‌లో 5MP సెల్ఫీ కెమెరా వుంది. ఇది ప్రాథమిక సెన్సార్లు మరియు కనెక్టివిటీ లక్షణాలతో Wi-Fi మరియు బ్లూటూత్ 5.0 తో వస్తుంది. ఈ ఫోన్ 5,000 mAh బ్యాటరీని 10W రెగ్యులర్ ఛార్జింగ్ సపోర్ట్ తో కలిగి వుంది.