బడ్జెట్ ధరలో ఆండ్రాయిడ్ 12 ఫోన్ కోసం చూస్తున్నారా.!

బడ్జెట్ ధరలో ఆండ్రాయిడ్ 12 ఫోన్ కోసం చూస్తున్నారా.!
HIGHLIGHTS

బడ్జెట్ ధరలో ఆండ్రాయిడ్ 12 ఫోన్

Redmi A1+ పైన ఒక లుక్ వేయండి

లేటెస్ట్ షియోమీ స్మార్ట్ ఫోన్ పూర్తి వివరాలు ఏమిటో చూడండి

బడ్జెట్ ధరలో ఆండ్రాయిడ్ 12 ఫోన్ కోసం చూస్తున్నారా? అయితే, షియోమీ ఇండియాలో లేటెస్ట్ గా విడుదల చేసిన Redmi A1+ పైన ఒక లుక్ వేయండి. ఎందుకంటే, కేవలం రూ.6,999 రూపాయల ప్రారంభం ధరలో లభించే ఈ షియోమీ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ పెద్ద డిస్ప్లే, పెద్ద బ్యాటరీతో పాటుగా ఆండ్రాయిడ్ 12 (గో ఎడిషన్) OS పైన నడుస్తుంది. మరి ఈ లేటెస్ట్ షియోమీ స్మార్ట్ ఫోన్ పూర్తి వివరాలు ఏమిటో చూడండి.                   

Redmi A1+: ధర

షియోమీ ఈ ఫోన్ బేస్ మోడల్ ని 2GB RAM మరియు 32GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.7,499 లాంచ్ చేసింది. అదే సమయంలో, 3GB RAM వేరియంట్ 32GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.8,499 గా ప్రకటించింది. అయితే, దీపావళి అఫర్ ఇంకా అందుబాటులో వుంది కాబట్టి, కొనుగోలుదారులు ఈ ఫోన్ 2GB వేరియంట్ ను రూ. 6,999 ధరకు మరియు 3GB వేరియంట్‌ను రూ.7,999 కి కొనుగోలు చేయవచ్చు. కానీ, ఈ అఫర్ ధర కేవలం అక్టోబర్ 17 నుండి అక్టోబర్ 31 వరకూ Mi.com, Mi హోమ్ స్టోర్స్, Flipkart మరియు రిటైల్ పార్టనర్స్ వద్ద మాత్రమే చెల్లుబాటు అవుతుంది.      

Redmi A1+: స్పెసిఫికేషన్లు

రెడ్ మీ ఎ1+ స్మార్ట్ ఫోన్ HD+ (720 x 1600 పిక్సెల్స్) రిజల్యూషన్‌ కలిగిన 6.52-అంగుళాల IPS LCD డిస్ప్లేని కలిగి ఉంది. ఈ డిస్ప్లే సాధారణ 60Hz రిఫ్రెష్ రేట్‌కు మద్దతు ఇస్తుంది. ఈ డిస్ప్లే 20:9 యాస్పెక్ట్ రేషియో మరియు ఫ్రంట్ కెమెరా కోసం పైభాగంలో వాటర్-డ్రాప్ నాచ్‌ ని కూడా కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ MediaTek Helio A22 SoC ప్రాసెసర్‌ని కి జతగా 3GB ర్యామ్ తో వస్తుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 12 (గో ఎడిషన్) OS పైన రన్ అవుతుంది.

ఇక ఈ ఫోన్ కలిగిన కెమెరాల విషయానికి వస్తే, ఈ ఫోన్ వెనుక డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ వుంది. ఇందులో 8ఎంపి ప్రైమరీ సెన్సార్ కి జతగా 2ఎంపి డెప్త్ కెమెరా వుంది. ముందు, సెల్ఫీల కోసం 8ఎంపి సెల్ఫీ కెమెరాని ఈ ఫోన్ కలిగివుంది. Redmi A1+ స్మార్ట్ ఫోన్ 10W ఛార్జింగ్ సపోర్ట్‌ కలిగిన పెద్ద 5000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo