Xiaomi రెడ్మీ 5 యొక్క పూర్తి విశ్లేషణ
చైనా స్మార్ట్ఫోన్ మేకర్ అయిన Xiaomi భారతదేశం లో ఇటీవల విడుదల చేసిన సరికొత్త కాంపాక్ట్ స్మార్ట్ఫోన్ Xiaomi Redmi 5 నిన్ననే అంటే మార్చ్ 20 న తన మొదటి సేల్స్ జరుపుకుంది , ఈ స్మార్ట్ఫోన్ నిన్న మధ్యాహ్నం 12 గంటలకు అమెజాన్ ఇండియా మరియు M.Com ద్వారా ఈ స్మార్ట్ ఫోన్ సేల్స్ జరిగాయి . ఈ సేల్ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది . ఇక ఫోన్ స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకుంటే ఈ ఫోన్లో 5.7 ఇంచెస్ టచ్స్ర్కీన్ డిస్ప్లే, 720 *1440 పిక్సెల్స్ రిజల్యూషన్ ని కలిగి వుంది 282 పిపిఐలో లభిస్తుంది. భారతదేశంలో రెడ్మి 5 ధర రూ. 7,999.
అయితే ఈ స్మార్ట్ ఫోన్ ని కంపెనీ గత ఏడాది డిసెంబర్ లో చైనా లో లాంచ్ చేసింది ,ఇదే కాక ఈ స్మార్ట్ఫోన్ తో పాటుగా Redmi నోట్ 5 స్మార్ట్ఫోన్ ని కూడా విడుదల చేసింది. ఇప్పుడు ఈ స్మార్ట్ఫోన్ భారతదేశంలో దాని ఆధిపత్యం కొనసాగించడానికి కంపెనీ కు సహాయపడుతుందో లేదో చూడాలి .
Redmi 5 1.8GHz ఆక్టో కోర్ క్వాల్కమ్ స్నాప్డ్రాగెన్ 450 ప్రాసెసర్ ఆధారితమైనది మరియు ఇది 2GB RAM తో వస్తుంది. ఇక ఇంటర్నల్ స్టోరేజ్ పరంగా చూసినట్లయితే 16GB ఇంటర్నల్ స్టోరేజ్ ని కలిగి వుంది .ఈ స్టోరేజ్ ని 128జీబీ వరకు ఎక్స్ పాండ్ చేయవచ్చు . కెమెరా పరంగా చూసినట్లయితే , Redmi 5 వెనుక 12-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాను మరియు 5-మెగాపిక్సెల్ ఫ్రంట్ షూటర్ ని సెల్ఫీ కోసం కలిగి వుంది .
Redmi 5 Android 7.1.2 ఫై రన్ అవుతుంది మరియు ఇక బ్యాటరీ విషయానికి వస్తే ఒక 3300mAh నాన్ రిమూవబుల్ బ్యాటరీ కలిగి వుంది . ఇది 157.00 గ్రాముల బరువు ఉంటుంది.
Redmi 5 అనేది నానో-సిమ్ ని యాక్సెప్ట్ చేస్తున్న డ్యూయల్ సిమ్ (GSM మరియు GSM) స్మార్ట్ఫోన్. ఇక దీనిలో కనెక్టువిటీ ఆప్షన్స్ Wi-Fi, GPS, బ్లూటూత్, USB OTG, FM, 3G మరియు 4G. ఫోన్లో సెన్సార్స్ ప్రాక్సిమిటీ సెన్సార్, యాక్సిలెరోమీటర్ సెన్సార్ , అమ్బియంట్ లైట్ సెన్సర్ మరియు గైరోస్కోప్ సెన్సార్లు వున్నాయి.