Redmi 14C 5G ను చవక ధరలో లాంచ్ చేసిన షియోమీ: ధర మరియు ఫీచర్స్ తెలుసుకోండి.!
Redmi 14C 5G ను ఈరోజు షియోమీ ఇండియాలో విడుదల చేసింది.
ఈ స్మార్ట్ ఫోన్ ను బడ్జెట్ ధరలో వేగవంతమైన ప్రోసెసర్ తో లాంచ్ చేసింది
రెడ్ మీ 14C 5జి స్మార్ట్ ఫోన్ ధర మరియు ఫీచర్స్ తెలుసుకోండి
Redmi 14C 5G స్మార్ట్ ఫోన్ ను ఈరోజు షియోమీ ఇండియాలో విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ ను బడ్జెట్ ధరలో వేగవంతమైన ప్రోసెసర్ మరియు మరిన్ని ఇతర ఫీచర్స్ తో లాంచ్ చేసింది. ఈ కొత్త స్మార్ట్ ఫోన్ ను ఈ ప్రైస్ సెగ్మెంట్ లో గొప్ప పోటీదారుగా నిలబెట్టడానికి, షియోమీ ఈ ఫోన్ లో గొప్ప ఫీచర్స్ అందించినట్లు తెలిపింది. ఈరోజే సరికొత్తగా ఇండియాలో విడుదలైన రెడ్ మీ 14C 5జి స్మార్ట్ ఫోన్ ధర మరియు ఫీచర్స్ తెలుసుకోండి.
Redmi 14C 5G : Price
రెడ్ మీ 14C 5జి స్మార్ట్ ఫోన్ ను రూ. 9,999 రూపాయల ప్రారంభ ధరతో లాంచ్ చేసింది. ఈ ఫోన్ యొక్క బేసిక్ (4GB + 64GB) వేరియంట్ కోసం నిర్ణయించింది. ఈ ఫోన్ యొక్క రెండవ వేరియంట్ (4GB + 128GB) వేరియంట్ ను రూ. 10,999 ధరతో లాంచ్ చేసింది. హై ఎండ్ రియంట్ (6GB + 128GB) వేరియంట్ ను రూ. 11,999 ధరతో లాంచ్ చేసింది.
రెడ్ మీ 14C 5జి స్మార్ట్ ఫోన్ మొదటి సేల్ జనవరి 10వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభం అవుతుంది. ఈ ఫోన్ ను షియోమీ రిటైల్, mi.com, అమెజాన్ మరియు ఫ్లిప్ కార్ట్ నుంచి లభిస్తుంది.
Also Read: Xiaomi ప్రీమియం Dolby Vision IQ స్మార్ట్ టీవీ పై భారీ డిస్కౌంట్ అందుకోండి.!
Redmi 14C 5G : ఫీచర్స్
రెడ్ మీ 14C 5జి స్మార్ట్ ఫోన్ ను గ్లాసి బ్యాక్ డిజైన్ తో అందించింది. ఈ ఫోన్ 6.88 ఇంచ్ బిగ్ డిస్ప్లే కలిగి ఉంటుంది మరియు ఈ డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్ ను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ను Snapdragon 4 Gen 2 చిప్ సెట్ తో పని చేస్తుంది మరియు 6GB వరకు ర్యామ్ మరియు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది.
ఈ షియోమీ కొత్త ఫోన్ వెనుక 50MP డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ మరియు 8MP సెల్ఫీ కెమెరా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ను 5160 బిగ్ బ్యాటరీ మరియు 18W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ తో లాంచ్ చేసింది. అయితే, ఈ ఫోన్ బాక్స్ లో మాత్రం 33W ఫాస్ట్ చార్జర్ ను ఉచితంగా అందించింది.