Redmi 14C 5G స్మార్ట్ ఫోన్ ను ఇండియా తో సహా గ్లోబల్ డెబ్యూట్ గా లాంచ్ చేస్తున్నట్లు షియోమీ అనౌన్స్ చేసింది. ఈ అప్ కమింగ్ రెడ్ మీ స్మార్ట్ ఫోన్ ను ప్రీమియం స్టార్ లైట్ డిజైన్ తో లాంచ్ చేస్తోందని కూడా షియోమీ తెలిపింది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ మరియు కీలకమైన ఫీచర్స్ తో షియోమీ టీజింగ్ చేస్తోంది.
రెడ్ మీ 14సి 5జి స్మార్ట్ ఫోన్ ను జనవరి 6వ తేదీ ఇండియాలో విడుదల చేస్తుందని షియోమీ కన్ఫర్మ్ చేసింది. ఈ ఫోన్ కోసం Flipkart సేల్ పార్ట్నర్ గా ఉంటుంది. అందుకే, ఈ ఫోన్ కోసం ప్రత్యేకమైన మైక్రో సైట్ పేజి తో టీజింగ్ చేస్తోంది.
రెడ్ మీ 14సి 5జి స్మార్ట్ ఫోన్ ను ప్రీమియం స్టార్ లైట్ డిజైన్ తో లాంచ్ చేస్తోంది. ఈ ఫోన్ లో వెనుక డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ను పెద్ద రౌండ్ బంప్ డిజైన్ తో కలిగి ఉంటుంది. ఇందులో 50MP ప్రధాన కెమెరా కలిగిన డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. ఈ ఫోన్ ను డ్యూయల్ 5G సపోర్ట్, ఫాస్ట్ డౌన్ లోడ్స్, ల్యాగ్ ఫ్రీ వీడియో కాలింగ్ మరియు మంచి గేమింగ్ అందించగల వేగవంతమైన చిప్ సెట్ తో లాంచ్ చేస్తుందని రెడ్ మీ టీజింగ్ చేస్తోంది.
ఈ అప్ కమింగ్ షియోమీ స్మార్ట్ ఫోన్ మూడు కలర్ వేరియంట్ లలో లాంచ్ అవుతుందని కంపెనీ తెలిపింది. టీజర్ ఇమేజ్ ద్వారా ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేసింది. ఈ ఫోన్ లో వాటర్ డ్రాప్ సెల్ఫీ కెమెరా కలిగి ఉంటుంది. రానున్న రోజులో ఈ ఫోన్ యొక్క మరిన్ని ఫీచర్స్ ను ఒక్కొక్కటిగా వెల్లడిస్తుందని కంపెనీ తెలిపింది.
Also Read: Lava Yuva 2 5G: స్టైలిష్ నోటిఫికేషన్ లైట్ తో కొత్త ఫోన్ లాంచ్ చేసిన లావా.!
ఈ ఫోన్ ను బడ్జెట్ ధరలో తీసుకు వచ్చే అవకాశం వుంది. కంపెనీ తెలిపిన ప్రకారం పెద్ద మరియు స్మూత్ డిస్ప్లేతో ఈ ఫోన్ వస్తుందని అంచనా వేస్తున్నారు.