Redmi 13C: తక్కువ ధరలో 50MP AI ట్రిపుల్ కెమేరా ఫోన్ లాంచ్.!

Redmi 13C: తక్కువ ధరలో 50MP AI ట్రిపుల్ కెమేరా ఫోన్ లాంచ్.!
HIGHLIGHTS

షియోమి సరికొత్త బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ఇండియన్ మార్కెట్ లో అడుగుపెట్టింది

Redmi 13C తక్కువ ధరలో 50MP AI ట్రిపుల్ కెమేరా సెటప్ తో వచ్చింది

రెడ్ మి 13సి స్మార్ట్ ఫోన్ మూడు వేరియంట్ లలో లభిస్తుంది

షియోమి ఇండియా నుండి సరికొత్త బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ఇండియన్ మార్కెట్ లో అడుగుపెట్టింది. నిన్న రెడ్ మి 13సి సిరీస్ నుండి తీసుకు వచ్చిన Redmi 13C స్మార్ట్ ఫోన్ గురించే మనం మాట్లాడుకుంటోంది. ఈ ఫోన్ ను తక్కువ ధరలో 50MP AI ట్రిపుల్ కెమేరా సెటప్, చక్కని ఆకర్షణియైన డిజైన్ మరియు మరిన్ని ఫీచర్లతో అందించినట్లుగా చెబుతోంది షియోమి. ఈ లేటెస్ట్ రెడ్ మి ఫోన్ ధర మరియు స్పెక్స్ ఎలా ఉన్నాయో ఒక లుక్కేయండి.

Redmi 13C Price

రెడ్ మి 13సి స్మార్ట్ ఫోన్ మూడు వేరియంట్ లలో లభిస్తుంది. వీటి ధరలు మరియు వేరియంట్ వివరాలను క్రింద చూడవచ్చు.

Redmi 13C 4G (4GB + 128GB) ధర రూ. 8,999

Redmi 13C 4G (6GB + 128GB) ధర రూ. 9,999

Redmi 13C 4G (8GB + 256GB) ధర రూ. 11,499

రెడ్ మి 13సి స్మార్ట్ ఫోన్ పైన రూ. 1,000 రూపాయల బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ ను కూడా అందిస్తోంది. ICICI, SBI మరియు HDFC బ్యాంక్స్ క్రెడిట్ మరియు డెబిట్ కార్డ్ EMI ఆప్షన్ తో ఈ ఫోన్ ను కొనే వారికి ఈ డిస్కౌంట్ లభిస్తుంది. డిసెంబర్ 12వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకి ఈ ఫోన్ మొదటిసారిగా సేల్ కు అందుబాటులోకి వస్తుంది.

Also Read : Gold Rate Drop: భారీగా పడిపోయిన గోల్డ్ రేట్..ఈరోజు రేటు ఎంతంటే.!

రెడ్ మి 13సి ప్రత్యేకతలు

రెడ్ మి 13సి స్మార్ట్ ఫోన్ 6.74 ఇంచ్ డాట్ డ్రాప్ డిస్ప్లేని 450 నిట్స్ పీక్ బ్రైట్నెస్ మరియు 90Hz రిఫ్రెష్ రేట్ తో కలిగి ఉంటుంది. ఈ ఫోన్ MediaTek Helio G85 ఆక్టా కోర్ ప్రోసెసర్ కి జతగా 8GB వరకూ ర్యామ్ మరియు 256 GB ఇంటర్నల్ స్టోరేజ్ ని కలిగి వుంది. ఈ ఫోన్ లో 8.09mm మందంతో సన్నగా ఉంటుంది మరియు స్టార్ డస్ట్ బ్లాక్, స్టార్ షైన్ గ్రీన్ రెండు రంగుల్లో లభిస్తుంది.

రెడ్ మి 13సి ప్రత్యేకతలు

రెడ్ మి 13సి స్మార్ట్ ఫోన్ వెనుక భాగంలో 50MP మెయిన్ కెమేరా + 2MP మ్యాక్రో కెమేరా + AI కెమేరా గల ట్రిపుల్ కెమేరా సెటప్ వుంది. ఈ కెమేరాతో 30fps వద్ద FHD (1920×1080) వీడియోలను మరియు HDR mode ఫోటోలను చిత్రీకరించవచ్చని కంపెనీ తెలిపింది. రెడ్ మి 13సి ఫోన్ లో ముందు 8MP సెల్ఫీ కెమేరా కూడా వుంది.

ఇక ఈ లేటెస్ట్ రెడ్ మి ఫోన్ కలిగి ఉన్న ఇతర వివరాల్లోకి వెళితే, ఈ ఫోన్ లో సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ మరియు AI ఫేస్ అన్లాక్ ఫీచర్స్ ఉన్నాయి. రెడ్ మి 13సి ఫోన్ MIUI 14 సాఫ్ట్ వేర్ ఆధారిత ఆండ్రాయిడ్ 13 OS పైన పని చేస్తుంది. ఈ ఫోన్ లో 5000 mAh పెద్ద బ్యాటరీని 18W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ తో అందించింది. అయితే, ఫోన్ పాటు 10W ఛార్జర్ ని మాత్రమే కంపెనీ అందిస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo