షియోమి గత కొంత కాలంగా ఉరిస్తున్న బడ్జెట్ 5జి స్మార్ట్ ఫోన్ Redmi 13C 5G ను ఈరోజు ఇండియన్ మార్కెట్ లో విడుదల చేసింది. రెడ్ మి 13సి 5జి స్మార్ట్ ఫోన్ అతి తక్కువ ధరలో 8GB RAM మరియు 256GB స్టోరేజ్ తో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ ను షియోమి ప్రసుతం మార్కెట్ లో 15 వేల ధరలో ఉన్న ఫోన్లకు పోటీగా తీసుకు వచ్చింది. మరి ఈ కొత్త రెడ్ మీ బడ్జెట్ 5జి స్మార్ ఫోన్ ధర మరియు ప్రత్యేకతలు ఏమిటో ఒక లుక్కేద్దామా.
రెడ్ మి 13సి 5జి స్మార్ట్ ఫోన్ ను షియోమి మూడు వేరియంట్స్ లో విడుదల చేసింది. అంతేకాదు, ఈ ఫోన్ లాంచ్ ఆఫర్ లో భాగంగా బ్యాంక్ మరియు ఎక్స్ ఛేంజ్ బోనస్ ఆఫర్ ను కూడా అనౌన్స్ చేసింది. ఈ ఫోన్ ధరలను క్రింద చూడవచ్చు.
Redmi 13C 5G (4GB + 128GB) ధర రూ. 10,999
Redmi 13C 5G (6GB + 128GB) ధర రూ. 12,499
Redmi 13C 5G (8GB + 256GB) ధర రూ. 14,499
ఈ ఫోన్ లను ICICI బ్యాంక్ కార్డ్స్ తో కొనే వారికి రూ. 1,000 డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే, ఈ ఫోన్ పైన అధనపు ఎక్స్ చేంజ్ బోనస్ ఆఫర్ ను కూడా జత చేసింది. ఈ ఫోన్ డిసెంబర్ 16వ తేదీ నుండి mi.com, అమేజాన్ ఇండియా మరియు షియోమి రిటైలర్ స్టోర్ లలో సేల్ కి అందుబాటులోకి వస్తుంది.
Also Read : OnePlus 12 Launched: 24GB ర్యామ్ మరియు 8K కెమేరాతో విడుదలైన వన్ ప్లస్ కొత్త ఫోన్.!
రెడ్ మి 13సి 5జి స్మార్ట్ ఫోన్ ను 6.74 ఇంచ్ HD+ డిస్ప్లేని 450 పీక్ బ్రైట్నెస్ ని కలిగి వుంది. ఈ ఫోన్ 90Hz రిఫ్రెష్ రేట్ ను మరియు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ తో కలిగి వుంది. ఈ ఫోన్ ను MediaTek లేటెస్ట్ ప్రోసెసర్ Dimensity 6100+ 5G చిప్ సెట్ తో లాంచ్ చేసింది. ఈ ప్రోసెసర్ కి జతగా 4GB / 6GB / 8GB RAM మరియు 128GB / 256GB ఇంటర్నల్ స్టోరేజ్ లను కలిగి ఉంటుంది.
ఈ ఫోన్ లో వెనుక 50MP AI డ్యూయల్ రియర్ కెమేరాని కలిగి వుంది మరియు 5MP సెల్ఫీ కెమేరాని కూడా కలిగి వుంది. ఈ ఫోన్ మెయిన్ కెమేరాతో 30fps వద్ద FHD (1920 x 1080) వీడియోలను చిత్రీకరించ గలదు. ఈ ఫోన్ లో 7 ప్రత్యేకమైన ఫోటో ఫిల్టర్ లను కూడా కలిగి వుంది.
ఈ ఫోన్ 5000 mAh బిగ్ బ్యాటరీని 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగి వుంది. ఈ ఫోన్ లేటెస్ట్ MIUI 14 సాఫ్ట్ వేర్ పైన Android 13 OS తో పని చేస్తుంది.