ఇండియన్ మార్కెట్ లో ఈరోజు Redmi 13 5G స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసింది Xiaomi. ఈ స్మార్ట్ ఫోన్ ని బడ్జెట్ ధరలో 108MP కెమెరా వంటి మరిన్ని ఫీచర్స్ తో విడుదల చేసింది. ఈ ఫోన్ ను రెండు వేరియంట్స్ మరియు మూడు కలర్ ఆప్షన్ లతో అందించింది. ఈ ఫోన్ ధర, స్పెక్స్ మరియు ఫీచర్లు ఎలా ఉన్నాయో ఒక లుక్కేద్దాం పదండి.
రెడ్ మీ 13 5జి స్మార్ట్ ఫోన్ ను రెండు వేరియంట్లలో విడుదల చేసింది. ఇందులో, బేసిక్ (6GB + 128GB) వేరియంట్ ను రూ. 13,999 ధరతో అందించింది. రెండవ వేరియంట్ (8GB + 128GB) ను రూ. 15,999 ధరతో ప్రకటించింది. జూలై 12వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుండి ఈ ఫోన్ మొదటి సేల్ మొదలవుతుంది. ఈ ఫోన్ ను mi.com మరియు అమెజాన్ ఇండియా నుండి సేల్ కి అందుబాటులోకి తీసుకు వస్తుంది.
Also Read: Lava Blaze X: 64MP Sony కెమెరా అద్భుతమైన డిజైన్ తో రేపు లాంచ్ అవుతోంది.!
రెడ్ మీ 13 5జి స్మార్ట్ ఫోన్ లో 6.79 ఇంచ్ FHD+ డిస్ప్లే వుంది. ఈ స్క్రీన్ 120HZ అడాప్టివ్ సింక్ రిఫ్రెష్ రేట్ మరియు గొప్ప బ్రైట్నెస్ ను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ గ్లాస్ బ్యాక్ తో అందంగా కనిపిస్తోంది. ఈ ఫోన్ లో మంచి ప్రోసెసర్ ను అందించింది. ఈ ఫోన్ లో స్నాప్ డ్రాగన్ 4 జెన్ 2 AE చిప్ సెట్ ను అందించింది. దానికి జతగా 8GB ర్యామ్ + 8GB వర్చువల్ ర్యామ్ మరియు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ లను అందించింది.
ఈ ఫోన్ కెమెరాను కూడా ఆకట్టుకునేలా అందించింది. ఈ ఫోన్ లో 108MP మెయిన్ కెమెరా కలిగిన డ్యూయల్ రియర్ కెమెరా మరియు రింగ్ ఫ్లాష్ ఉన్నాయి. ఈ ఫోన్ లో సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ మరియు హైబ్రిడ్ సిమ్ స్లాట్ కూడా వుంది. ఈ ఫోన్ ను 5030mAh బ్యాటరీ మరియు 33W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ తో అందించింది. ఈ ఫోన్ బ్లాక్ డైమండ్, హవాయి బ్లూ మరియు ఆర్కిడ్ పింక్ మూడు కలర్ ఆప్షన్ లలో లభిస్తుంది.