Redmi 12C: బడ్జెట్ ధరలో బిగ్ వర్చువల్ ర్యామ్ తో లాంచ్ అయ్యింది.!

Redmi 12C: బడ్జెట్ ధరలో బిగ్ వర్చువల్ ర్యామ్ తో లాంచ్ అయ్యింది.!
HIGHLIGHTS

రెడ్ మి నుండి మరొక బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ఈరోజు ఇండియన్ మార్కెట్ లోకి వచ్చింది

ఈ ఫోన్ అధిక ర్యామ్ కోసం వర్చువల్ ర్యామ్ ఫీచర్ తో వచ్చింది

ఎంటర్టైన్మెంట్ కోసం బిగ్ డిస్ప్లే మరియు లాంగ్ బ్యాటరీ కూడా వుంది

రెడ్ మి నుండి మరొక బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ఈరోజు ఇండియన్ మార్కెట్ లోకి వచ్చింది. అదే, Redmi 12C స్మార్ట్ ఫోన్ మరియు ఈ ఫోన్ అధిక ర్యామ్ కోసం వర్చువల్ ర్యామ్ ఫీచర్ మరియు గేమింగ్ చిప్ సెట్ తో విడుదల చేయబడింది. ఇది మాత్రమే కాదు, ఎంటర్టైన్మెంట్ కోసం బిగ్ డిస్ప్లే మరియు లాంగ్ బ్యాటరీ కూడా ఈ ఫోన్ కలిగివున్నట్లు షియోమి తెలిపింది. ఈ లేటెస్ట్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ పైనఒక లుక్కేద్దాం పదండి.         

Redmi 12C: ధర

రెడ్ మి 12C స్మార్ట్ ఫోన్ బేసిక్ వేరియంట్ (4GB + 64GB) రూ.8,999 రూపాయల ధరతో లాంచ్ అయ్యింది. 6GB ర్యామ్ మరియు 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.10,999. ఈ ఫోన్ యొక్క ఫస్ట్ సేల్ ఏప్రిల్ 6వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు Flipkart మరియు mi స్టోర్ జరగుతుంది. ఈ ఫోన్ ను ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ మరియు EMI తో కొనేవారికి 500 రూపాయల డిస్కౌంట్ లభిస్తుంది.

Redmi 12C: స్పెక్స్

Redmi 12C ఫోన్ 6.71-ఇంచ్ HD+ రిజల్యూషన్ కలిగిన డిస్ప్లేని కలిగి ఉంది. ఈ డిస్ప్లే 60Hz రిఫ్రెష్ రేట్‌ మరియు 120Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. ఈ ఫోన్ మీడియాటెక్ గేమింగ్ ప్రోసెసర్ Helio G85 తో పనిచేస్తుంది. అలాగే, ఈ ఫోన్ 4GB/6GB RAM జతగా 3GB/5GB వర్చువల్ ర్యామ్ ఫీచర్ ను కూడా కలిగివుంది. ఈ ఫోన్ షియోమి యొక్క MIUI 13 సాఫ్ట్ వేర్ తో ఆండ్రాయిడ్ 12 OS పైన నడుస్తుంది. 

ఈ ఫోన్ లో వెనుక డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ వుంది. ఇందులో, 50MP మెయిన్ కెమెరాకి జతగా QVGA కెమెరా వుంది. అలాగే, సెల్ఫీల కోసం ముందు భాగంలో 5MP సెల్ఫీ కెమెరా ఉంది. ఈ ఫోన్ 5000mAh బ్యాటరీని 10W రెగ్యులర్ ఛార్జింగ్ సపోర్ట్ తో కలిగివుంది. 

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo