Redmi ఇండియాలో మరొక బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేసింది. Redmi 12C పేరుతో విడుదల చేసిన ఈ స్మార్ట్ ఫోన్ బడ్జెట్ ధరలో కూడా వర్చువల్ ర్యామ్ ఫీచర్ తో వచ్చింది. అంతేకాదు, ఈ ఫోన్ లో కంటెంట్ ను ఆనందించడానికి వీలుగా పెద్ద స్క్రీన్ మరియు హెవీ బ్యాటరీతో తీసుకొచ్చినట్లు కంపెనీ తెలిపింది. మరి షియామి యొక్క ఈ సరికొత్త స్మార్ట్ ఫోన్ వివరాలేమిటో చూద్దామా.
రెడ్ మి 12C స్మార్ట్ ఫోన్ బేసిక్ వేరియంట్ (4GB + 64GB) రూ.8,999 రూపాయల ధరతో లాంచ్ అయ్యింది. 6GB ర్యామ్ మరియు 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.10,999. ఈ ఫోన్ యొక్క ఫస్ట్ సేల్ ఏప్రిల్ 6వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు Flipkart మరియు mi స్టోర్ జరగుతుంది. ఈ ఫోన్ ను ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ మరియు EMI తో కొనేవారికి 500 రూపాయల డిస్కౌంట్ లభిస్తుంది.
Redmi 12C ఫోన్ 6.71-ఇంచ్ HD+ రిజల్యూషన్ కలిగిన డిస్ప్లేని కలిగి ఉంది. ఈ డిస్ప్లే 60Hz రిఫ్రెష్ రేట్ మరియు 120Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. ఈ ఫోన్ మీడియాటెక్ గేమింగ్ ప్రోసెసర్ Helio G85 తో పనిచేస్తుంది. అలాగే, ఈ ఫోన్ 4GB/6GB RAM జతగా 3GB/5GB వర్చువల్ ర్యామ్ ఫీచర్ ను కూడా కలిగివుంది. ఈ ఫోన్ షియోమి యొక్క MIUI 13 సాఫ్ట్ వేర్ తో ఆండ్రాయిడ్ 12 OS పైన నడుస్తుంది.
ఈ ఫోన్ లో వెనుక డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ వుంది. ఇందులో, 50MP మెయిన్ కెమెరాకి జతగా QVGA కెమెరా వుంది. అలాగే, సెల్ఫీల కోసం ముందు భాగంలో 5MP సెల్ఫీ కెమెరా ఉంది. ఈ ఫోన్ 5000mAh బ్యాటరీని 10W రెగ్యులర్ ఛార్జింగ్ సపోర్ట్ తో కలిగివుంది.