Xiaomi ఇటీవల ఇండియన్ మార్కెట్ లో విడుదల చేసిన Redmi 12 Series సేల్స్ కొత్త మైలు రాయిని దాటాయి. రెడ్ మి 12 సిరీస్ విడుదలైన నాటి నుండి కేవలం 100 రోజుల్లో 3 మిలియన్ (30 లక్షల) యూనిట్స్ అమ్ముడైనట్లు కంపెనీ ప్రకటించింది. ఈ హ్యాపీ మూవ్ మెంట్ ను తెలియపరుస్తూ తన ట్విట్టర్ అకౌంట్ నుండి ఈ విషయాన్ని షేర్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ లను పండుగ సీజన్ సమయానికి మార్కెట్ లో విడుదల చేయడం కంపెనీకి కలిసొచ్చినట్లు కనిపిస్తోంది.
బడ్జెట్ ధరలో తగిన ఫీచర్స్ మరియు 5G తో వచ్చిన ఈ రెడ్ మి 12 సిరీస్, భారత యూజర్లను మంచిగా ఆకట్టుకుంది. ఈ ఫోన్ విడుదలైన తరువాత మొదటి సేల్ నుండి 3 లక్షల యూనిట్స్ ను 28 రోజులకు 1మిలియన్ (10 లక్షల యూనిట్స్ ) మైలు రాయిని చేరుకుంది. అయితే, ఇప్పుడు 100 రోజుల లోపలే 30 లక్షల యూనిట్స్ సేల్ ని అధిగమించినట్లు షియోమి సాదరంగా తెలిపింది.
రెడ్ మి 12 సిరీస్ నుండి కంపెనీ రెండు ఫోన్లను మాత్రమే విడుదల చేసింది. అందులో ఒకటి 5G ఫోన్ కాగా మరోకటి 4G ఫోన్. అయితే. స్పెక్స్ పరంగా రెండు కూడా ఆకట్టుకుంటాయి. ఎందుకంటే, ఈ రెండు స్మార్ట్ ఫోన్లు కూడా 6.79 FHD+ 90 Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లేని కలిగి ఉంటాయి. అయితే, రెడ్ మి 12 4G ఫోన్ MediaTek Helio G88 గేమింగ్ ప్రోసెసర్’తో వస్తే, రెడ్ మి 12 5G ఫోన్ మాత్రం snapdragon 4 Gen 2 ఫాస్ట్ 5G ప్రోసెసర్ తో వస్తుంది.
ఈ రెండు ఫోన్ల కెమేరాలో కూడా వ్యత్యాసం వుంది. 12 4G 50MP ట్రిపుల్ రియర్ కెమేరాతో వస్తే, 12 5G మాత్రం 50MP డ్యూయల్ రియర్ కెమేరాతో వస్తుంది. అయితే, రెండు ఫోన్లు కూడా ఒకే డిజైన్ మరియు బ్యాటరీ సెటప్ ను కలిగి ఉంటాయి. ఈ రెండు ఫోన్లలో 5000 mAh బ్యాటరీని 22.5W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ తో అందించింది షియోమి.
Also Read : విరాట్ కోహ్లీ తో సహా క్రికెటర్స్ ధరించిన ఈ WHOOP Fitness band గురించి మీకు తెలుసా | Tech News