Redmi 12: ఇండియాలో లాంచ్ కి సిద్ధమైన షియోమి ఫోన్.!
షియోమి ఇండియాలో Redmi 12 స్మార్ట్ ఫోన్ ను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది
ఆగష్టు 1వ తేది ఇండియాలో లాంచ్ చేయనున్నట్లు షియోమి అనౌన్స్ చేసింది
కీలకమైన స్పెక్స్ మరియు ఫీచర్లతో టీజింగ్ మొదలు పెట్టింది
షియోమి ఇండియాలో Redmi 12 స్మార్ట్ ఫోన్ ను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఈ స్మార్ట్ ఫోన్ ను ఆగష్టు 1వ తేది ఇండియాలో లాంచ్ చేయనున్నట్లు షియోమి అనౌన్స్ చేసింది. ఈ ఫోన్ కోసం Flipkart ప్రత్యేకమైన మైక్రో సైట్ పేజ్ ను కూడా అందించింది. అంటే, ఈ ఫోన్ ఆన్లైన్ పార్ట్నర్ ఫ్లిప్ కార్ట్ అని అర్ధం చేసుకోవచ్చు. రెడ్ మి 12 స్మార్ట్ ఫోన్ లాంచ్ కి ఇంకా చాలా సమయం ఉండగానే, కంపెనీ కీలకమైన స్పెక్స్ మరియు ఫీచర్లతో టీజింగ్ మొదలు పెట్టింది. ఈ షియోమి అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ యొక్క ఆ కీలకమైన వివరాలు ఏమిటో తెలుసుకుందామా.
Redmi 12:
రెడ్ మి 12 స్మార్ట్ ఫోన్ డిజైన్ మరియు కలర్ వివరాలను కంపెనీ టీజింగ్ ద్వారా వెల్లడించింది. అయితే, ఈ రెడ్ మి అప్ కమింగ్ ఫోన్ యొక్క టీజర్ ఇమేజ్ ద్వారా చాలా వివరాలు మనం చూడవచ్చు.
రెడ్ మి 12 స్మార్ట్ ఫోన్ ను క్రిస్టల్ గ్లాస్ డిజైన్ తో తీసుకువస్తునట్లు కంపెనీ తెలిపింది. ఈ ఫోన్ ముందుగా వచ్చిన Redmi Note 12 Series స్మార్ట్ ఫోన్స్ అందించిన కెమేరా మాదిరి డిజైన్ తో కనిపిస్తోంది. అయితే, ఇందులో కెమేరా బంప్ ఉండదు.
ఈ ఫోన్ లో వెనుక ట్రిపుల్ కెమేరా సిస్టం మరియు ఒక LED ఫ్లాష్ లైట్ ఉన్నాయి. వెనుక కెమేరా సెటప్ క్రింద AI ని కంపెనీ సూచించింది. ఈ ఫోన్ కుడి ప్రక్కన పైభాగాన వాల్యూమ్ మరియు పవర్ బటన్ ఉన్నాయి.
ఈ ఫోన్ ముందు భాగంలో పంచ్ హోల్ డిజైన్ ను కలిగి వుంది. అలాగే, ఈ డిస్ప్లే సన్నని అంచులతో కనిపిస్తోంది. షియోమి ప్రస్తుతానికి ఈ వివరాలను మాత్రమే అందించింది. మరిన్ని వివరాలను దశాల వారీగా రివీల్ చేయనున్నట్లు టీజింగ్ చేస్తోంది.
జూలై 18, జూలై 22 మరియు జూలై 24న ఈ ఫోన్ యొక్క కీలకమైన ఫీచర్లను వెల్లడించనున్నట్లు కంపెనీ టీజర్ ద్వారా చెబుతోంది. మరిన్ని అప్డేట్స్ కోసం అప్పటి వరకూ వేచి చూడాల్సిందే.