Price Cut: లేటెస్ట్ షియోమి 5G ఫోన్ పైన భారీ తగ్గింపు అందుకోండి.!

Updated on 15-Mar-2024
HIGHLIGHTS

షియోమి లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ భారీ ఆఫర్లతో చవక ధరకే లభిస్తోంది

కొత్త 5జి స్మార్ట్ ఫోన్ 10 వేల ధరలో కొనాలని చూస్తుంటే ఈ ఆఫర్ పైన ఒక లుక్కేయండి

ఈ ఫోన్ పైన మంచి బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి

Price Cut: షియోమి లెట్స్ స్మార్ట్ ఫోన్ భారీ ఆఫర్లతో చవక ధరకే లభిస్తోంది. ఇటీవలే భారత్ మార్కెట్ లో విడుదలై ఈ స్మార్ట్ ఫోన్ ను ఇప్పుడు చవక ధరకే అందుకోవచ్చు. కొత్త బ్రాండ్ న్యూ 5జి స్మార్ట్ ఫోన్ ను మంచి ఆఫర్లతో 10 వేల ధరలో కొనాలని చూస్తున్న వారికీ ఇది మంచి అవకాశం అవుతుంది. మీరు కూడా కొత్త 5జి స్మార్ట్ ఫోన్ 10 వేల ధరలో కొనాలని చూస్తుంటే ఈ ఆఫర్ పైన ఒక లుక్కేయండి.

Price Cut On Redmi 12 5G

రెడ్ మి రీసెంట్ గా ఇండియాలో విడుదల చేసిన ఈ కొత్త స్మార్ట్ ఫోన్ Redmi 12 5G (4GB RAM+128GB) వేరియంట్ ఈరోజు అమెజాన్ ఇండియా నుండి భారీ తగ్గింపుతో లభిస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ ఈరోజు కేవలం రూ. 11,999 ఆఫర్ ధరికే లభిస్తోంది. అంతే కాదు, ఈ స్మార్ట్ ఫోన్ పైన రూ. 1,000 రూపాయల కూపన్ డిస్కౌంట్ ఆఫర్ ని కూడా జత చేసింది.

ఈ ఆఫర్ల ద్వారా ఈ స్మార్ట్ ఫోన్ ని 10 వేల బడ్జెట్ ధరకే అందుకునే అవకాశం మీ ముందు ఉంది. ఇది మాత్రమే కాదు, ఈ ఫోన్ పైన మంచి బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.

Also Read: Lava O2 launch: కొత్త ఫోన్ లాంఛ్ కోసం టీజింగ్ స్టార్ట్ చేసిన లావా.!

Redmi 12 5G: ప్రత్యేకతలు

రెడ్ మి 12 స్మార్ట్ ఫోన్ Snapdragon 4 Gen 2 ఫాస్ట్ 5జి ప్రోసెసర్ శక్తితో వచ్చింది. ఈ రెడ్ మి ఫోన్ 6.79 ఇంచ్ పరిమాణం మరియు FHD+ రిజల్యూషన్ కలిగిన పెద్ద డిస్ప్లేని కలిగి వుంది. ఈ స్క్రీన్ 90Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ మరియు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 రక్షణతో ఉంటుంది. ఈ ఫోన్ MIUI 14 సాఫ్ట్ వేర్ పైన Android 13 OS పైన పని చేస్తుంది.

Redmi 12 5G Features

50MP AI డ్యూయల్ రియర్ కెమేరా మరియు 8MP సెల్ఫీ కెమేరాలను ఈ ఫోన్ కలిగి వుంది. ఈ ఫోన్ కెమేరాలో క్లాసిక్ ఫిల్మ్ ఫిల్టర్స్, 50MP మోడ్ మరియు ఫిల్మ్ ఫ్రేమ్ వంటి మరిన్ని ఫీచర్స్ ఉన్నాయి. ఈ ఫోన్ 5000 mAh బ్యాటరీని ఛార్జింగ్ బాక్స్ లో 22.5W ఫాస్ట్ ఛార్జర్ ను కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 4GB RAM మరియు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :