Realme సంస్థ తన రియల్ మీ X7 సిరీస్ ను ఇండియాలో రిలీజ్ డేట్ ప్రకటించింది. Realme X7 స్మార్ట్ ఫోన్ తో పాటుగా Realme X7 Pro స్మార్ట్ ఫోన్ ను కూడా ఇండియాలో ఫిబ్రవరి 4 వ తేదీన రిలీజ్ చేయడానికి డేట్ ఫిక్స్ చేసింది. ఈ X7 సిరీస్ స్మార్ట్ ఫోన్లు వేగవంతమైన MediaTek Dimensity ప్రొసెసర్ తో తీసుకువస్తున్నట్లు టీజింగ్ కూడా అందించింది. అయితే, అనుకోకుండా ఈ Realme X7 ధర వివరాలు లీక్ అయ్యాయి.
ప్రముఖ టిప్స్టర్ దేబ్యన్ రాయ్ చేసిన ట్వీట్ ప్రకారం, రియల్ మి 7 యొక్క ప్రారంభ వేరియంట్ 19,999 రూపాయల ధర ఉండవచ్చని అర్ధమవుతోంది. ఈ బేస్ వేరియంట్ 6GB ర్యామ్ మరియు 128GB స్టోరేజ్ తో ఉండవచ్చు. ఇక మరొక వేరియంట్ 8GB ర్యామ్ మరియు 128 GB స్టోరేజ్ కలిగి 21,999 రుపాయల ధర కలిగివుండే అవకాశం కనిపిస్తోంది.
Realme X7 సిరీస్ రిలీజ్ విషయానికి వస్తే, ఈ రిలీజ్ కార్యక్రమం ఫిబ్రవరి 4 న మధ్యాహ్నం 12:30 గంటలకి ప్రారంభమవుతుంది. Realme X7 సిరీస్ నుండి రానున్న ఈ రెండు స్మార్ట్ ఫోన్ల స్పెషిఫికేషన్ల గురించి ఇప్పటికే రియల్ మీ తన అధికారిక వెబ్సైట్ నుండి చాలా వివరాలను అందించింది. Realme X7 మరియు X7 Pro రెండు స్మార్ట్ ఫోన్లు కూడా 5G టెక్నాలజీ కలిగిన మీడియా టెక్ డైమెన్సిటీ ప్రొసెసర్ మరియు 5G ఎనేబుల్ తో తీసుకొస్తోంది. అంతేకాదు, 64MP క్వాడ్ కెమెరా, SuperAMOLED డిస్ప్లే మరియు మరిన్ని లేటెస్ట్ ఫీచర్లతో లాంచ్ చేయనున్నది.