RealMe U1 మొదట సేల్ ఈ రోజే : 25MP సెల్ఫీ కెమెరా మరియు మరెన్నో విశేషాలు తెలుసుకోండి

Updated on 05-Dec-2018
HIGHLIGHTS

తాజాగా వచ్చిన షావోమి రెడ్మి నోట్ 6 ప్రో మరియు రియల్మీ 2 ప్రో కి పోటీగా ఉండనుంది.

Realme యొక్క తాజా స్మార్ట్ ఫోన్, Realme U1 యొక్క మొట్టమొదటి అమ్మకాలను ఈరోజు 12pm నుండి అమేజాన్ ఇండియా నుండి ప్రారంభించనుంది. ఈ స్మార్ట్ ఫోన్ గత నెల చివరిలో ప్రారంభించబడింది మరియు మీడియా టెక్ హీలియో P70 SoC ద్వారా ఆధారితమైన మొదటి పరికరం కూడా ఇదే. ఈ Realme U1 సంస్థ యొక్క ఐదవ ఫోన్ మరియు దాని 'U' శ్రేణిలో మొదటి పరికరం. సంస్థ హ్యాండ్ సెట్లో ఒక శక్తివంతమైన కెమెరాను తీసుకొచ్చింది మరియు Realme U1 దాని ధర పరిధిలో అత్యంత శక్తివంతమైన సెల్ఫీ కెమెరా కలిగి ఉందని కంపెనీ పేర్కొంది. కంపెనీ ద్వారా వచ్చిన ఈ కొత్త స్మార్ట్ ఫోన్,  షావోమి రెడ్మి నోట్ 6 ప్రో  వంటి ఇతర ఫోన్లు మరియు అదే ధర విభాగంలో దాని సొంత Realme 2 Pro లకు  పోటిగా ఉండనుండి.

Realme U1 ధర మరియు లాంచ్ ఆఫర్లు

రియల్మీ U1, అమెజాన్ ద్వారా ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు అమ్మకానికి ఉండనుంది. ఈ ఫోన్ యొక్క 3 జీబి ర్యామ్ వెర్షన్ ధర రూ .11,999 మరియు 4 జీబి ర్యామ్ వేరియంట్ రూ .14,499. SBI బ్యాంక్ వినియోగదారులు డెబిట్ మరియు క్రెడిట్ కార్డులపై 5 శాతం క్యాష్ బ్యాక్ పొందవచ్చు, మరియు పరికరంతో  నో-కాస్ట్ EMI ఎంపిక కూడా ఉంది. రిలయన్స్ Jio వినియోగదారులు మరియు రియల్మీ U1 భాగస్వామ్యంతో ఈ పరికరం కొనుగోలు పైన 4.2TB వరకూ 4G డేటా  పొందవచ్చు. కొనుగోలుదారుల కోసం, బ్యాక్ కవర్లు మరియు రూ. 499 ధరలో రియల్మీ యొక్క బడ్స్ ఇయర్ఫోన్స్ లభ్యమవుతుంది.

Realme U1 ప్రత్యేకతలు మరియు లక్షణాలు

హార్డ్వేర్ పరంగా, Realme U1 ఒక 6.3-అంగుళాల ఫుల్ HD + డిస్ప్లేను 90.8% స్క్రీన్ టూ బాడీ నిష్పత్తి మరియు ఒక 'డ్యూ డ్రాప్ నోచ్' తో కలిగి ఉంది. పైన పేర్కొన్న విధంగా, ఈ స్మార్ట్ ఫోన్నీ అక్టోబర్ లో ప్రకటించారు ఇది ఆక్టా కోర్ మీడియా టెక్ Helio P70 SoC తో నడుస్తుంది. ఈ హ్యాండ్సెట్ రెండు వేరియంట్లలో ఒకటి, 3GB RAM మరియు 32GB స్టోరేజితో మరియు మరొకటి 4GB RAM మరియు 64GB స్టోరేజితో వస్తుంది. ఇది AI పవర్ మాస్టర్ టెక్నాలజీతో 3500mAh బ్యాటరీ మద్దతుతో  వస్తుంది, ఇది పరికరం యొక్క బ్యాటరీని విశ్లేషించడానికి మరియు సహాయం చేయడానికి ఉపయోగపడుతుంది. ఈ ఫోనులో డ్యూయల్ సిమ్ తో పాటుగా,  మైక్రోSD స్లాట్ కూడా ఉంది.

వెనుకవైపు, 'లైట్ పిల్లర్ డిజైన్' తో రియల్మీ U1 2.5D గ్లాస్ ఫినిష్ మరియు  వేలిముద్ర సెన్సార్ కలిగి డ్యూయల్ కెమెరా సెటప్తో వస్తుంది. ఇది 13MP + 2MP కెమెరా సెటప్ పోర్ట్రైట్ లైటింగ్, బోకె మరియు సూపర్ వివిడ్ మోడ్లలో చిత్రాలను తీసే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. దీనితో HD రిజల్యూషన్లో 90fps వద్ద స్లో-మోషన్ వీడియోను కూడా రికార్డ్ చేయవచ్చు. సెల్ఫీ కెమెరాకి వస్తే, ఒక AI- శక్తితో కూడిన 25MP సెన్సార్తో ఫోన్ వస్తుంది, ఇది అధిక-res డెప్త్ ఇంజిన్ను "ఖచ్చితమైన" AI గుర్తింపుతో కలిగి ఉంటుంది. ముందు f2.0 ఆపేర్చేర్ మరియు 1.8 అంగుళాల పిక్సెల్ పరిమాణం ఉంది. ముందు కెమెరా హైబ్రిడ్ HDR, గ్రూప్  సెల్ఫీ ఫీచర్లు, సెల్ఫీ బోకె ప్రభావం మరియు AI ఫేస్ ఫెషియల్ డిటెక్షన్ కలిగివుంటుంది. AI ఫేస్ అన్లాక్ ఫీచర్ 0.1 సెకన్లలో స్మార్ట్ ఫోన్ను అన్లాక్ చేయగదని Realme వాదనలు తెలియజేస్తున్నాయి. ఈ స్మార్ట్ ఫోన్ Android 8.1 Oreo తో నడుస్తుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :